వెబ్ సిరీస్ గా రానున్న చలం ’మైదానం‘

హైదరాబాద్ : కరోనాతో సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. గత నాలుగు నెలలుగా షూటింగ్ లు లేకపోవడంతో తారలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినప్పటికీ, షూటింగ్ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.  దీంతో డిజిటల్ మీడియా తెరమీదకు వచ్చింది. కొత్తకొత్త కథలతో పలువురు వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. తెలుగులో వచ్చిన ప్రముఖ నవలలను, సీరియళ్లను వెబ్ సిరీస్ లో తీసేందుకు పలువురు ప్రయత్నాలు మొదలు పెట్టారు. […] The post వెబ్ సిరీస్ గా రానున్న చలం ’మైదానం‘ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : కరోనాతో సినీ పరిశ్రమ స్తంభించిపోయింది. గత నాలుగు నెలలుగా షూటింగ్ లు లేకపోవడంతో తారలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినప్పటికీ, షూటింగ్ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది.  దీంతో డిజిటల్ మీడియా తెరమీదకు వచ్చింది. కొత్తకొత్త కథలతో పలువురు వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. తెలుగులో వచ్చిన ప్రముఖ నవలలను, సీరియళ్లను వెబ్ సిరీస్ లో తీసేందుకు పలువురు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే మధుబాబు రాసిన ’షాడో‘ నవలనను సినిమాగా తీసేందుకు ఎకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ సన్నాహాలు చేస్తోంది. అయితే చలం రాసిన ’మైదానం‘ నవలను వెబ్ సిరీస్ గా రూపొందించేందుకు దర్శకుడు వేణు ఉడుగుల సన్నాహాలు చేస్తున్నారు. ’మైదానం‘ వెబ్ సిరీస్ కు నిర్మాతగా ఆయన వ్యవహరించనున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఏర్పాటు చేసిన తెలుగు ఒటిటి ఆహా కోసం ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నట్టు వేణు ఉడుగుల వెల్లడించారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post వెబ్ సిరీస్ గా రానున్న చలం ’మైదానం‘ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: