మహిళా కానిస్టేబుల్‌కు వార్నింగ్.. మంత్రి కొడుకు అరెస్ట్

సూరత్: గుజరాత్‌లో ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడిని, అతని ఇద్దరు స్నేహితులను లాక్‌డౌన్ నేపథ్యంలో విధించిన నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్‌లో నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కుమారుడు ప్రకాష్‌ను, అతని స్నేహితులను మహిళ కానిస్టేబుల్ సునీతా యాదవ్ నిలదీసింది. అనంతరం.. ఆ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసిన మంత్రి కుమారుడు వాగ్వాదానికి దిగాడు. ‘మాకు పవర్ ఉంది.. నేను తలుచుకుంటే మమ్మల్ని ఎక్కడ నిలబెట్టావో అదే ప్లేస్‌లో […] The post మహిళా కానిస్టేబుల్‌కు వార్నింగ్.. మంత్రి కొడుకు అరెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

సూరత్: గుజరాత్‌లో ఆరోగ్య శాఖ మంత్రి కుమారుడిని, అతని ఇద్దరు స్నేహితులను లాక్‌డౌన్ నేపథ్యంలో విధించిన నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. సూరత్‌లో నైట్ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన మంత్రి కుమారుడు ప్రకాష్‌ను, అతని స్నేహితులను మహిళ కానిస్టేబుల్ సునీతా యాదవ్ నిలదీసింది. అనంతరం.. ఆ మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసిన మంత్రి కుమారుడు వాగ్వాదానికి దిగాడు. ‘మాకు పవర్ ఉంది.. నేను తలుచుకుంటే మమ్మల్ని ఎక్కడ నిలబెట్టావో అదే ప్లేస్‌లో నిన్ను 365 రోజులూ నిల్చోబెడతా’ అని మంత్రి కొడుకు ఫోన్‌లో మహిళా కానిస్టేబుల్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఆ వార్నింగ్‌కు సునీతా యాదవ్ బెదరలేదు. అంతే స్ట్రాంగ్‌గా బదులిచ్చింది. ‘365 రోజులు అక్కడ నిలబెడితే నిల్చోడానికి నేను నీకు బానిసను కాదు, నీ తండ్రికి సర్వెంట్‌ను కాదు’ అని గట్టిగా చెప్పింది. ఈ ఆడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

Gujarat minister son arrested for violating covid 19 rules

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మహిళా కానిస్టేబుల్‌కు వార్నింగ్.. మంత్రి కొడుకు అరెస్ట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: