వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత అవసరం : ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ : వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అంటు వ్యాధులు ప్రబలవని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించాలని ఆయన ప్రజలకు సూచించారు. ’మీకోసం‘ కార్యక్రమంలో భాగంగా మంత్రి తన ఇంటి ఆవరణను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలకు నీళ్లు పోశారు. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నిలువ ఉన్న నీటిని తక్షణమే తొలగించాలని ఆయన చెప్పారు. వర్షాకాలంలో […] The post వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత అవసరం : ఇంద్రకరణ్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నిర్మల్ : వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే అంటు వ్యాధులు ప్రబలవని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించాలని ఆయన ప్రజలకు సూచించారు. ’మీకోసం‘ కార్యక్రమంలో భాగంగా మంత్రి తన ఇంటి ఆవరణను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలకు నీళ్లు పోశారు. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నిలువ ఉన్న నీటిని తక్షణమే తొలగించాలని ఆయన చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ప్రజల సహకరించినప్పుడే కరోనా కట్టడి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రోడ్ల మీదకు వచ్చినప్పుడు  విధిగా భౌతికదూరం పాటించాలని, మాస్క్ లు దరించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టిఆర్ఎస్ నిర్మల్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము తదితరులు పాల్గొన్నారు.

The post వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత అవసరం : ఇంద్రకరణ్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: