నిలకడగా ‘బిగ్‌బి’ఆరోగ్యం

ముంబై: కరోనాతో బాధపడుతున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు కొద్ది స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తెలిపింది. నానావతి ఆస్పత్రిలో ఐసొలేషన్ వార్డులో అమితాబ్ చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో అమితాబ్ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా శనివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. మిగిత కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ ఇంకా […] The post నిలకడగా ‘బిగ్‌బి’ ఆరోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబై: కరోనాతో బాధపడుతున్న బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు కొద్ది స్థాయిలో కరోనా లక్షణాలు ఉన్నాయని ముంబైలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తెలిపింది. నానావతి ఆస్పత్రిలో ఐసొలేషన్ వార్డులో అమితాబ్ చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో అమితాబ్ తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా శనివారం రాత్రి ఆస్పత్రిలో చేరారు. మిగిత కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. అమితాబ్ ఇంటికి శానిటైజ్ సిబ్బంది చేరుకున్నారు. జల్సాను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామని మున్సిపల్ సిబ్బంది పేర్కొన్నారు.

 నానావతి ఆస్పత్రి వైద్యుల సేవలను అమితాబ్ ప్రశంసించారు. అటు అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ సెలబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. అమితాబ్ శరీరంలోనే విజయం అనే వ్యాక్సిన్ ఉందంటూ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. దిగ్గజ నటుడు అమితాబ్ త్వరగా కోలుకోవాలంటూ పలువురు టాలీవుడ్ నటులు ట్వీట్ చేశారు. ”మీరు త్వరగా కోలుకోవాలని మేమంతా కోరుకుంటున్నాము అమిత్‌ జీ” అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ”డియర్‌ అమిత్‌ జీ…. మీరు త్వరగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము” అని నాగార్జున తెలిపారు. ప్రిన్స్ మ‌హేశ్ బాబు‌, ర‌వితేజ‌, రాశీఖ‌న్నా, తాప్సీ, ప్రియ‌మ‌ణి, నిత్యామీన‌న్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు బిగ్ బి‌ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామ‌ని తెలిపారు.

Amitabh Bachchan Health is stable

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నిలకడగా ‘బిగ్‌బి’ ఆరోగ్యం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: