దారి చూపిన ధారావి

  కరోనా కట్టడిలో విజయం సాధించిన ఆసియాలోనే అతి పెద్దదైన ముంబయిలోని మురికివాడ ఇంటింటా స్క్రీనింగ్‌లు, టెస్టింగ్‌లతో సత్ఫలితాలు రెండు నెలల వ్యవధిలో ప్రజల సహకారంతో వైరస్‌పై విజయం డబ్లుహెచ్‌ఒ ప్రశంసలు ముంబై : ధారావి… ముంబైలోని మురికివాడ. పేదరికపు ఇరుకు బతుకుల కిక్కిరిసిన రద్దీ వాడ, ఆసియాలోనే అతి పెద్ద స్లమ్.. వాణిజ్య రాజధాని ముంబైలోని ఈ మురికివాడలో ప్రతిరోజూ రెక్కాడితే కానీ డొక్కాడని తెల్లారని స్థితి. ఈ స్లమ్ కరోనా వైరస్ కాటుకు గురైంది. […] The post దారి చూపిన ధారావి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా కట్టడిలో విజయం సాధించిన ఆసియాలోనే
అతి పెద్దదైన ముంబయిలోని మురికివాడ

ఇంటింటా స్క్రీనింగ్‌లు, టెస్టింగ్‌లతో సత్ఫలితాలు
రెండు నెలల వ్యవధిలో ప్రజల సహకారంతో వైరస్‌పై విజయం
డబ్లుహెచ్‌ఒ ప్రశంసలు

ముంబై : ధారావి… ముంబైలోని మురికివాడ. పేదరికపు ఇరుకు బతుకుల కిక్కిరిసిన రద్దీ వాడ, ఆసియాలోనే అతి పెద్ద స్లమ్.. వాణిజ్య రాజధాని ముంబైలోని ఈ మురికివాడలో ప్రతిరోజూ రెక్కాడితే కానీ డొక్కాడని తెల్లారని స్థితి. ఈ స్లమ్ కరోనా వైరస్ కాటుకు గురైంది. రేకుల షెడ్లలోని నివాసాలలో పక్కనే పారే మురికికాలువలతో ఉండే ఈ మురికివాడ మొన్న మొన్నటి వరకూ కరోనా వైరస్ కు హాట్‌స్పాట్ అయింది. ఇప్పుడు కరోనాను ఓడించిన ఆదర్శ నివాస ప్రాంతంగా నిలిచి అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించుకుంది. వైరస్ కట్టడిలో ఈ ప్రాంతం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచింది. కరోనా శత్రువుపై యుద్ధంలో ఈ మురికివాడ సాధించిన విజయంవెనుక జనం భాగస్వామ్యం ఉంది. అధికారుల స్పందన మిళితం అయింది.

ప్రపంచ అత్యధిక జనసాంద్రత ప్రదేశం
ప్రపంచంలో అతి కిక్కిరిసిన ప్రాంతం ఈ మురికివాడ. అక్కడి మొత్తం విస్తీర్ణం 613 హెక్టార్లు , మూడున్నర లక్షల మందికి పైగా ప్రతి చదరపు కిలోమీటరు చొప్పున ఉంటున్నారు. ఎప్రిల్ 1వ తేదీన ఇక్కడ తొలిసారిగా కరోనా కేసు వచ్చింది. వైరస్ వ్యాప్తి చెందుతూ చివరికి ఎప్రిల్ చివరి నాటికి మొత్తం 491 మందికి వైరస్ సోకింది. 18 రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో డబ్లింగ్ పరిణామం చోటుచేసుకుంది. మే నెల నాటికి ఇక్కడ ఏకంగా 491 మందికి కరోనా సోకింది. ఇందులో 56 మంది చనిపొయ్యారు. జూన్ చివరి నాటికి మరణాలు తగ్గాయి. అక్కడ అప్పటి నుంచి ఇప్పటివరకూ కరోనాతో ఏ ఒక్కరూ మృతి చెందలేదు. ఈ విధంగా రెండు నెలల వ్యవధిలో కరోనాను ఈ ప్రాంతీయులు జయించారు.

కట్టడిలో ఆదర్శం ఎలా అయింది?
సరైన వైద్య పరీక్షలతో ఇక్కడ వైరస్‌ను సమగ్రరీతిలో అరికట్టినట్లు వెల్లడైంది. ఆరోగ్య, మహానగర పురపాలక సంస్థ అధికారుల సమన్వయంతో ఇక్కడ దాదాపుగా 50వేల నివాసాల తలుపులు తట్టారు. ప్రతి ఒక్కరి శారీరక పరిస్థితిపై వాకబు చేశారు. అందరికీ పరీక్షలు నిర్వహించారు. వారి శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించడం, అక్కడి ప్రాణవాయువు స్థాయి ఎంత ఉందనేది ఆరా తీయడం వంటివి చేశారు. మర వైపు ఈ మురికివాడల సముదాయంలోని దాదాపు ఏడు లక్షల మంది రక్తపు నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షలకు పంపించారు. మురికివాడల్లోనే జ్వరం పరీక్షల క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. దీనితో వైరస్ ఎంత మందికి వచ్చిందనేది నిర్థారించుకోవడానికి వీలేర్పడింది. వైరస్ లక్షణాలు ఉన్న వారిని వెంటనే సమీపంలోని స్కూళ్లలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అక్కడ వారికి సరైన చికిత్స అందించారు.

తీవ్రస్థాయి పరీక్షలే కీలకం
భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ఇతరత్రా రక్షణ సాధనాలు వాడటానికి ఇష్టపడని, సాధ్యపడని జనం ఉండే ఈ ప్రాంతంలో వైరస్ కట్టడి అధికారులకు సవాలుగానే నిలిచింది. ముందుగా ఈ ప్రాంతంలో మరుగుదొడ్ల సంఖ్యను పెంచారు. వైరస్‌ను కట్టడిచేయడమే ఇక్కడ అత్యుత్తమ మార్గమని, వైరస్‌కు గురి కాకుండా ప్రజలను చైతన్యపర్చడం అసాధ్యం అని తాము గుర్తించామని అందుకే ఈ దిశలో సరైన చర్యలు తీసుకున్నామని ముంబై మున్సిపాల్టీ అసిస్టెంట్ కమిషనర్ కిరణ్ దిఘావకర్ తెలిపారు. చికిత్స కంటే ముందు ఇక్కడ వైరస్ నివారణ చర్యలు కీలకం అని తాము నిర్థారణకు వచ్చినట్లు తెలిపారు. తొలి దశలోనే వైరస్ సోకిన వారినివేరు చేసిక్వారంటైన్‌కు పంపించడం వల్ల ఇతరులకు వైరస్ సోకలేదని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో అక్కడున్న ఇతరులకు స్క్రీనింగ్‌లు, టెస్టింగ్‌లు పెద్ద ఎత్తున చేపట్టారు. మరణాలను తగ్గించడమే లక్షంగా పెట్టుకున్నామని వివరించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చింది.

ఉచిత వైద్య సేవలు
ఈ ప్రాంతంలోని ప్రజలు నిరుపేదలు. శ్రామికులు, తిండికి తప్ప చికిత్సలకు ఆరోగ్యానికి పెద్దగా ఖర్చు పెట్టలేని స్థితి. ఈ దశలో రోగులకు వైద్య చికిత్స, ఇతరులకు ఆరోగ్య పరిరక్షణ దిశలో చర్యలు తీసుకోవడం ముఖ్యమని భావించారు. ఉచిత వైద్య సేవలకు ఏర్పాట్లు చేశారు. దాదాపు పదిలక్షల మంది వరకూ నివాసం ఉండే ఈ ప్రాంతంలో ఖచ్చితంగా లాక్‌డౌన్ విధించడం, ఇదే సమయంలో టెస్టింగ్‌లు, ఉచిత వైద్య పరీక్షలతో వైరస్ అదుపులోకి వచ్చింది. ప్రజలు అంతా స్వచ్ఛందంగా ముందుక వచ్చి పరీక్షలు నిర్వహించుకోవడం, క్వారంటైన్‌కు వెళ్లడంతో తాము అనుకున్న వైరస్ కట్టడి లక్షాన్ని సాధించగల్గినట్లు అధికారులు తెలిపారు. అందరి విశ్వాసం, ఆత్మబలంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

యుద్ధం ఆగిపోలేదు
అయితే మొత్తం ముంబైలో నుంచి వైరస్ పారదోలేవరకూ ఇక్కడ కూడా యుద్ధం సాగుతూనే ఉంటుందని , ఎక్కడా రాజీ ఉండదని స్థానిక అధికారులు తెలిపారు. ముంబై ఒక్కటే కాదు రాష్ట్రం, దేశం నుంచి వైరస్ పారదొలాల్సిందే అని స్పష్టం చేశారు. ఇంతకు ముందటితో పోలిస్తే ప్రజలలో వైరస్ పట్ల అవగావహన పెరిగింది. భద్రతతో ఏ విధంగా ఉండాలి? ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది తెలుసుకుంటున్నారు. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే దశ నాటికి మన అలవాట్లలో వచ్చిన మార్పుతో ఎక్కువ మందికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ వ్యాప్తితం కావాలని ఆశిస్తున్నామని ఉన్నతాధికారి తెలిపారు.

Dharavi a global role model of COVID management

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post దారి చూపిన ధారావి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.