నెలాఖరులోగా కోటి ఎకరాలు!

  వానాకాలంలో గణనీయంగా పెరిగిన సాగు తగ్గట్టుగా ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ అప్రమత్తం ఈ నెలలో 7.38లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో ఎరువుల కొరత రాకుండా చూడటంపై వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. కేంద్రం నుంచి వస్తున్న స్టాక్, మార్క్‌ఫెడ్ దగ్గర బఫర్ స్టాక్, డీలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల దగ్గర ఉన్న నిల్వలు, అమ్మకాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియా, ఇతర […] The post నెలాఖరులోగా కోటి ఎకరాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వానాకాలంలో గణనీయంగా పెరిగిన సాగు
తగ్గట్టుగా ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ అప్రమత్తం
ఈ నెలలో 7.38లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరగడంతో ఎరువుల కొరత రాకుండా చూడటంపై వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. కేంద్రం నుంచి వస్తున్న స్టాక్, మార్క్‌ఫెడ్ దగ్గర బఫర్ స్టాక్, డీలర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల దగ్గర ఉన్న నిల్వలు, అమ్మకాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యూరియా, ఇతర ఎరువుల కొరత రావొద్దని, ఎవరైనా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ కార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డి మన తెలంగాణకు చెప్పారు. ఈ ఏడాది వానాకాలంలో రా ష్ట్ర ప్రభుత్వం కోటి 25 లక్షల నియంత్రిత సాగును ప్రతిపాదించింది. ఇందులో ప్రధానంగా వరి, పత్తి, కంది పంటలు ఉన్నాయి. వరికి, పత్తికి యూరియా అధికంగా అవసరం అవుతుంది.

ఇప్పటికే దాదాపు 75 లక్షల ఎకరాల్లో పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఈ నెలఖారుకు కోటి ఎకరాలు దాటుతుందని అంచనా. గతేడాది ఇదే సమయానికి 35 లక్షల ఎకరాలు కూడా సాగులోకి రాలేదు. నైరుతి రుతు పవనాలు సకాలంలో రావడం, పెట్టుబడి సాయం అందడంతో సాగు పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే పత్తి పంటకు కొన్నిచోట్ల కలుపు తీస్తున్నారు. వరినాట్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. జూలై మూడో వారంలో నాట్లు అధికంగా పడుతాయని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎరువులకు ఒక్కసారిగా రైతులు వచ్చే అవకాశం ఉంది. దీనిని ఆసరాగా చేసుకునేందుకు కొందరు అక్రమార్కులు ప్రయత్నిస్తుంటారు.

అందులో భాగంగా సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఉన్నతస్థాయిలో ఎరువుల స్టాక్, అమ్మకాలపై పర్యవేక్షణ చేస్తోంది. ఇదే విషయాన్ని శనివారం సిఎంకు అధికారులు వివరించారు. ఈ ఏడాది వానాకలం సీజన్‌కు 22.30 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేంద్రం తెలంగాణకు కేటాయించింది. ఈ జూలైలో 7.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ మేరకు కేంద్రంకు సరఫరా గ్యాప్ లేకుండా కేటాయింపులు త్వరగా పంపాలని ఇప్పటికే కోరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా స్టాక్ 2.33 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్ ఉంది. మార్క్‌ఫెడ్ దగ్గర బఫర్ స్టాక్ 1.32 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. డీలర్ల దగ్గర 48 వేల మెట్రిక్ టన్నులు, సొసైటీల దగ్గర 51 వేల మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. 7.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల ప్లాన్ ప్రకారం 5.1 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు జూలై మాసానికి రాష్ట్రానికి వచ్చాయి. ప్రస్తుతం 6.08 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 77 వేల మెట్రిక్ టన్నులు అమ్ముడుపోయాయి. రైతులు పంటల సాగుకు అనుగుణంగా ఎరువులు కొనుగోలు చేయాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

యూరియా బ్లాక్ చేస్తే కఠిన చర్యలు
ఎరువుల కొరత రాకుండా, బ్లాక్ మార్కెట్ వంటివి చేయకుండా ముందస్తు పర్యవేక్షణ చేస్తున్నాం. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ ఆదేశాలకు అనుగుణంగా సరఫరా, విక్రయాల వివరాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాం. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. సాగునీటి వసతి పెరగడంతో వరి సాగు కూడా పెరుగుతోంది. గతం కంటే రెట్టింపు స్థాయిలో పంటలు సాగయ్యాయి. సాధారణంగా ఆగస్టులో యూరియా, ఇతర ఎరువులకు డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి జూలైలోనే డిమాండ్ ఏర్పడుతుంది. గతేడాది ఇలాగే కొరత ఏర్పడింది. ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా చూస్తాం.

                                                                                      – రాములు, అగ్రోస్ మేనేజింగ్ డైరెక్టర్

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నెలాఖరులోగా కోటి ఎకరాలు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: