నాలుగు నెలలు…రూ.200 కోట్లకు పైగా నష్టం

  హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ఈనెలాఖరు లేదా వచ్చే నెలాఖరుకు పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టుగా మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అనుమతి వచ్చినా ప్రయాణికుల కోసం అనేక రకాల చర్యలను మెట్రో చేపట్టాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా మెట్రోలో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడానికి వీలుపడదు. దీంతోపాటు ఒక సీటు మరోసీటుకు మధ్య తగినంత దూరం ఉండడంతో పాటు చివరిస్టాప్‌లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా మెట్రో అధికారులు పలుచర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత నెలకొంది. దీంతోపాటు కోవిడ్ 19 నిబంధనలు […] The post నాలుగు నెలలు… రూ.200 కోట్లకు పైగా నష్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో ఈనెలాఖరు లేదా వచ్చే నెలాఖరుకు పట్టాలెక్కే అవకాశం ఉన్నట్టుగా మెట్రో వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అనుమతి వచ్చినా ప్రయాణికుల కోసం అనేక రకాల చర్యలను మెట్రో చేపట్టాల్సి ఉంటుంది. గతంలో మాదిరిగా మెట్రోలో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడానికి వీలుపడదు. దీంతోపాటు ఒక సీటు మరోసీటుకు మధ్య తగినంత దూరం ఉండడంతో పాటు చివరిస్టాప్‌లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసేలా మెట్రో అధికారులు పలుచర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత నెలకొంది. దీంతోపాటు కోవిడ్ 19 నిబంధనలు పాటించేలా మెట్రో అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రతిరోజు మెట్రోలో సుమారు నాలుగు లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం మెట్రో పట్టాలెక్కినా ప్రయాణికుల సంఖ్య కూడా చాలా తగ్గిపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

లాక్‌డౌన్‌కు ముందు నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల ఆదాయం
లాక్‌డౌన్‌కు ముందు నెలకు రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య మెట్రోకు ఆదాయం సమకూరేది. ప్రస్తుతం నాలుగు నెలలుగా ఆదాయం లేకపోవడంతో మెట్రో సంస్థ ఇబ్బందులు పడుతోంది. మెట్రో రైలు మార్గాన్ని పూర్తి చేయడానికి ఎల్ అండ్ టి వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాన్ని సేకరించింది. దీనికి సొంత నిధులను కలుపుకొని సుమారు రూ.13 వేల కోట్లను ఈ నిర్మాణం నిమిత్తం ఎల్ అండ్ టి ఖర్చు చేసింది. ప్రస్తుతం జిహెచ్‌ఎంసి పరిధిలో ఉధృతంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెట్రో నష్టాల్లోకి కూరుకుపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రజారవాణా వ్యవస్థపై ఆశ వదులుకున్న నగరవాసులు
కోవిడ్ దెబ్బకు ఈ ఏడాది మార్చి 22 నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో మెట్రోకు నష్టాలు తప్పడంలేదు. రైళ్లు, స్టేషన్ల నిర్వహణ వ్యయం తడిసిమోపెడవుతుండడంతో ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల మేర నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. మొత్తంగా ఈ నెలాఖరుకు నష్టాలు రూ.200 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నగరంలోని నాగోల్- రాయదుర్గం, జెబిఎస్- ఎంజిబిఎస్, జెబిఎస్, ఎంజిబిఎస్ మూడు మార్గాల్లో 69 కి.మీ మార్గంలో మెట్రో అందుబాటులో ఉంది.

రోజురోజుకూ కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే మెట్రో రైళ్ల వాణిజ్య రాకపోకలను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అదుపు లేకుండా పెరుగుతున్న కోవిడ్ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో ఈ నెలలో ప్రభుత్వం అనుమతులిచ్చే అవకాశం లేదని మెట్రో వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు ఆర్టీసి బస్సులు, మరోవైపు మెట్రో రైళ్లు నిలిచిపోవడంతో నగరంలో ప్రజారవాణా వ్యవస్థపై ప్రస్తుతం నగరవాసులు ఆశలు వదులుకున్నారు.

ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం 45 శాతం మాత్రమే
కరోనా నేపథ్యంలో మెట్రో రైళ్లు, డిపోలు, స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు నిర్మాణ సంస్థకు భారంగా పరిణమించాయి. జరిగిన నష్టాన్ని చెల్లించాల్సిందిగా ఈ సంస్థ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సాధారణంగా మెట్రో ప్రాజెక్టులో ప్రయాణికుల చార్జీల ద్వారా వచ్చే ఆదాయం 45 శాతం మాత్రమే. మరో 50 శాతం వాణిజ్య స్థలాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రవాణా ఆధారిత ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా నిర్మాణ సంస్థ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరో 5 శాతాన్ని వ్యాపార, వాణిజ్య ప్రకటనల ద్వారా సమకూర్చుకోవాలని నిర్మాణ ఒప్పందంలో పేర్కొన్నారు. గత మూడున్నర నెలలుగా వాణిజ్య స్థలాల అద్దెలు, వాణిజ్య ప్రకటనల ఆదాయం సైతం అరకొరగా లభిస్తుండడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి.

అన్ని రెడీగా ఉన్నా…ఆదేశాల కొరకు వేచి చూస్తున్నాం…
మెట్రో స్టేషన్లు, ప్రయాణికులు వినియోగించే కామన్ ప్రాంతాలు, రైలు బోగీలను కోవిడ్- 19 నిబంధనల మేరకు ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేసి వినియోగంలోకి తీసుకొస్తామని, ప్రయాణికుల మధ్య విధిగా భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని మెట్రో వర్గాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాయి. స్టేషన్‌లోనికి ప్రవేశించే సమయంలో ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ సైతం నిర్వహించడానికి రెడీగా ఉన్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు ఇస్తే అప్పుడే ప్రారంభిస్తామని మెట్రో అధికారులు పేర్కొంటున్నారు.

200 cr losses for Hyderabad Metro in 4 months

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నాలుగు నెలలు… రూ.200 కోట్లకు పైగా నష్టం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: