అడవులను రక్షించుకోవాలి : ఇంద్రకరణ్ రెడ్డి

ఆదిలాబాద్ : కొత్త అడవులను సృష్టించడంతో పాటు ఉన్న అడవులను రక్షించుకున్నప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆరో విడత హరిత హారంలో భాగంగా భోథ్ నియోజకవర్గ పరిధిలోని నేరడిగొండ మండలలం బోరిగాం, బోథ్ మండం కౌట-బి గ్రామాల్లో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిఎం కెసిార్ ఆకు పచ్చని తెలంగాణను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన ఆశయసాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మంత్రి […] The post అడవులను రక్షించుకోవాలి : ఇంద్రకరణ్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ : కొత్త అడవులను సృష్టించడంతో పాటు ఉన్న అడవులను రక్షించుకున్నప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఆరో విడత హరిత హారంలో భాగంగా భోథ్ నియోజకవర్గ పరిధిలోని నేరడిగొండ మండలలం బోరిగాం, బోథ్ మండం కౌట-బి గ్రామాల్లో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిఎం కెసిార్ ఆకు పచ్చని తెలంగాణను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆయన ఆశయసాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మంత్రి పిలుపునిచ్చారు. అటవీ సంపదను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. అడవుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ప్రజల సహకారంతో అడవుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజల సహకారంతోనే కలప స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయగలుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఆరు మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన సూచించారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను సరంక్షించే బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ఆయన చెప్పారు.  ఈ కార్య‌క్ర‌మంలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, క‌లెక్టర్ దేవ‌సేన‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అడవులను రక్షించుకోవాలి : ఇంద్రకరణ్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: