బోయపాటి సినిమాలో బాలయ్యకి జోడీగా కొత్త భామ

హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘మోనార్క్’, ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా హీరోయిన్ అంజలి నటిస్తున్నారని, మరో ప్రధాన పాత్రలో శ్రియ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు ప్రముఖ తమిళ నటి […] The post బోయపాటి సినిమాలో బాలయ్యకి జోడీగా కొత్త భామ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘మోనార్క్’, ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా హీరోయిన్ అంజలి నటిస్తున్నారని, మరో ప్రధాన పాత్రలో శ్రియ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు ప్రముఖ తమిళ నటి అమలాపాల్ పేరు కూడా వినిపించింది. అయితే ఇవి ఒట్టి పుకార్లేనని, బాలయ్య సరసన ఓ కొత్త హీరోయిన్ నటించనుందని బోయపాటి వెల్లడించారు. అయితే బాలయ్య సరసన నటించే హీరోయిన్ గా ఓ అందమైన మోడల్ ను ఎంపిక చేశారని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలయ్య , బోయపాటి కాంబినేషన్ లో ’సింహ‘, ’లెజెండ్‘ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు హిట్ కావడంతో వీరు మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బాలయ్య అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post బోయపాటి సినిమాలో బాలయ్యకి జోడీగా కొత్త భామ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: