పిల్లలతో ఆడుకోనివ్వలేదని పక్కింటినే తగలబెట్టాడు…ఐదుగురు మృతి

  లక్నో: హోలీ వేడుకలను పక్కింటి పిల్లలతో ఆడుకోనివ్వలేదని ఆ ఇంటిని ఓ వ్యక్తి తగలబెట్టడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మోయిన్‌పూరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మురారీ కశ్యప్ అనే వ్యక్తి హోలీ వేడుకులను జరుపుకుంటున్నప్పుడు మద్యం మత్తులో పొరుగింటికి వెళ్లాడు. తమ పిల్లలతో ఆడుకోవడానికి వీల్లేదని కుటుంబ పెద్ద చెప్పడంతో వాళ్ల గొడవకు దిగాడు. ఇరుగుపొరుగు వారు మురారీపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో […] The post పిల్లలతో ఆడుకోనివ్వలేదని పక్కింటినే తగలబెట్టాడు… ఐదుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లక్నో: హోలీ వేడుకలను పక్కింటి పిల్లలతో ఆడుకోనివ్వలేదని ఆ ఇంటిని ఓ వ్యక్తి తగలబెట్టడంతో ఐదుగురు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మోయిన్‌పూరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మురారీ కశ్యప్ అనే వ్యక్తి హోలీ వేడుకులను జరుపుకుంటున్నప్పుడు మద్యం మత్తులో పొరుగింటికి వెళ్లాడు. తమ పిల్లలతో ఆడుకోవడానికి వీల్లేదని కుటుంబ పెద్ద చెప్పడంతో వాళ్ల గొడవకు దిగాడు. ఇరుగుపొరుగు వారు మురారీపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులపై పగపెంచుకున్నాడు. జూన్-17న అందరూ ఇంట్లో పడుకున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో బయట వైపున గడియపెట్టి పెట్రోల్ పోసి ఇంటిని తగలబెట్టాడు. ఇంటికి మంటల అంటుకోవడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. సైపాయి ఆస్పత్రికి వారిని తరలించగా చికిత్స పొందుతూ నలుగురు చనిపోగా రెండు రోజుల క్రితం వాళ్ల కూతురు కూడా చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మురారీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అమ్మాయి వాళ్ల సోదరుడు, సోదరుడి భార్య, సోదరుడి కూతరు బయట పడుకోవడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

The post పిల్లలతో ఆడుకోనివ్వలేదని పక్కింటినే తగలబెట్టాడు… ఐదుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: