ఉగ్రవాదంపై పాకిస్థాన్ కిమ్మనదేం!

  ఘటనలపై సమాచారానికి నిరాకరణ హక్కులను హరిస్తూ అనుచిత నిందలు ఐరాస సదస్సులో భారత్ ఎదురుదాడి ఐక్యరాజ్యసమితి/న్యూయార్క్ : భీకర ఉగ్రవాద దాడుల సమాచారంపై పాకిస్థాన్ ఉలుకూపలుకూ లేకుండా ఉందని భారతదేశం విమర్శించింది. ముంబై తదితర ప్రాంతాలలో జరిగిన ఉగ్రదాడులకు సంబంధిచిన వ్యూ హకర్తలు, సూత్రధారులు, పాత్రధారులు అంతా పాకిస్థాన్‌లో రాజమర్యాదలు పొందుతున్నారని విమర్శించింది. ఉగ్రవాద నిరోధక చర్చల వారం సందర్భంగా ఏర్పాటు అయిన ఆన్‌లైన్ సదస్సులో భారతీయ ప్రతినిధి బృందం సారథి మహవీర్ సింఘ్వీ పాకిస్థాన్ […] The post ఉగ్రవాదంపై పాకిస్థాన్ కిమ్మనదేం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఘటనలపై సమాచారానికి నిరాకరణ
హక్కులను హరిస్తూ అనుచిత నిందలు
ఐరాస సదస్సులో భారత్ ఎదురుదాడి

ఐక్యరాజ్యసమితి/న్యూయార్క్ : భీకర ఉగ్రవాద దాడుల సమాచారంపై పాకిస్థాన్ ఉలుకూపలుకూ లేకుండా ఉందని భారతదేశం విమర్శించింది. ముంబై తదితర ప్రాంతాలలో జరిగిన ఉగ్రదాడులకు సంబంధిచిన వ్యూ హకర్తలు, సూత్రధారులు, పాత్రధారులు అంతా పాకిస్థాన్‌లో రాజమర్యాదలు పొందుతున్నారని విమర్శించింది. ఉగ్రవాద నిరోధక చర్చల వారం సందర్భంగా ఏర్పాటు అయిన ఆన్‌లైన్ సదస్సులో భారతీయ ప్రతినిధి బృందం సారథి మహవీర్ సింఘ్వీ పాకిస్థాన్ వైఖరిని దుయ్యబట్టారు. ఉగ్రవాద దాడుల ఘటనలపై పాకిస్థాన్‌కు భారతదేశం పలు సార్లు తగు వివరణల కోసం కోరింది. అయితే ఇంతవరకూ అత్యంత భీకరమైన ఉగ్రవాద దాడుల ఘటనలపై ఆ దేశం నుంచి తమకు ఎటువంటి సమాచార వినిమయం లేకుండా పోయిందని సింఘ్వీ విమర్శించారు.

పాకిస్థాన్‌ను కేం ద్రంగా చేసుకుని ఉగ్రవాద దాడులు జరిగాయి. ముంబైలో వరస బాంబు పేలుళ్లు ఇతర ఘటనలపై తమ దేశం నిర్థిష్ట సాక్షాధారాలను పాకిస్థాన్‌కు పంపించిందని అంతర్జాతీయ సమాజానికి సింఘ్వీ తెలియచేశారు. అయితే వారి నుంచి ఎటువంటి స్పందనా వెలువడలేదని తెలిపారు. అంతేకాకుండా ఉగ్రవాదులు ప్రధాన పాత్రధారులు ఇప్పటికీ ఆ దేశంలోనే తిష్టవేసుకుని ప్రభుత్వ గౌరవాలను పొందుతున్నారని, ఇదేం పద్థతి అని ప్రశ్నించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం సమిష్టిగా పోరు సల్సాలనే విషయాన్ని మరోమారు ఈ సందర్భంగా మనమంతా ప్రకటించుకోవల్సి ఉందన్నారు. ఉగ్రవాదానికి ఏ విధంగా సహకరించినా అది అన్యాయమే అవుతుందని , అయితే పాకిస్థాన్ కనీస పద్థతిని కూడా పాటించకుండా ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టడంలో అసలు ఔచిత్యం ఉందా? అని ప్రశ్నించారు.

ఇటువంటి పరిణామాలతోనే ఆ దేశం నుంచి ఇప్పటికీ సీమాంతర ఉగ్రవాదం నిక్షేపంగా సాగుతోందని మండిపడ్డారు. పాకిస్థాన్ ఉగ్రవాద ఉత్పత్తి దేశంగా మారిందని అన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యల ద్వారా మానవ హక్కుల పరిరక్షణ దిశలో ప్రపంచదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సి ఉందని,అయితే దురదృష్టవశాత్తూ పాకిస్థాన్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని సింఘ్వీ విమర్శించారు. సరిహద్దుల మీదుగా ఉగ్రవాదులను దాటించడం, వారికి వ్యూహాత్మక మద్దతును అందించడం వంటివి జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు.

ఉగ్రవాదపు పడగల దేశం
ఉగ్రవాదపు విషసర్పానికి ప్రధాన స్థావరంగా పాకిస్థాన్ మారిందని అంతర్జాతీయంగా పలుసార్లు రుజువు అయిందని అన్నారు. ఉగ్రవాదపు వేదికగా మారిందని నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి భారత్‌లో జరిగిన పలు ఉగ్రవాద చర్యలకు పాకిస్థాన్ ప్రేరేపిత శక్తులే కారణం అని ఆధారాలతో వెల్లడైందని తెలిపారు. 1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్లు, తరువాత 2008లో జరిగిన దాడులకు సంబంధించి పాకిస్థాన్ అందించిన సైనిక ఆర్థిక ఇతరత్రా సాయం గురించి పలు సాక్షాలు ఉన్నాయని తెలిపారు. పాకిస్థాన్ చర్యలతో బాధితుల హక్కులు కాలరాసినట్లు అయిందని విమర్శించారు. అంతేకాకుండా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తన అధికారిక విధానాలలో ప్రధాన స్రవంతిగా ఖరారు చేసుకుందని తెలిపారు.

హక్కులపై బూటకపు వాదన
మానవ హక్కులకు సంబంధించి పాకిస్థాన్ బూటకపు వాదనకు దిగుతోందని, భారత్‌పై లేని పోని నిందలకు దిగుతోందని సింఘ్వీ విమర్శించారు. ఆ దేశంలో పద్ధతి ప్రకారం మైనార్టీల ఊచకోత జరుగుతోందని, వారిని అనేక విధాలుగా వేధిస్తున్నారని విమర్శించారు. క్రిస్టియ న్లు, అహ్మదీయులు, సిక్కులు, హిందువులు, షియాలు, పస్తూన్లు, హజారాలు, సింంధీలు, బలూచీలపై హింసాత్మక చర్యలు సాగుతున్నాయని, నిరంకుశ విధానాలతో మతమార్పిడులకు పాల్పడుతోందని విమర్శించారు.

జమ్మూకశ్మీర్‌పై లేనిపోని వాదనలు సాగిస్తూ వచ్చిన పాకిస్థాన్ అక్కడ పరోక్ష యుద్ధానికి కుట్రలు పన్నుతూ వచ్చిందని, కశ్మీర్ భారతదేశపు అంతర్భాగమనే విషయం అక్కడి ప్రజల సంఘీభావంతోనే మరోమారు స్పష్టం అయిందన్నారు. భారతదేశం వసుధైక కుటుంబ లక్షం తో సాగుతోందని, ఇందుకు భిన్నంగా సంకుచిత విధానాలతో పాకిస్థాన్ సాగుతోందని, ఈ క్రమంలో ఆ దేశంలో వేళ్లూనుకున్న ఉగ్రవాదపు విషపు మర్రి ఊడల వేళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర స్థితిని తెచ్చిపెడుతున్నాయని భారత ప్రతినిధి బృందం విమర్శించింది.

Singhvi also raised issue of human rights violations

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఉగ్రవాదంపై పాకిస్థాన్ కిమ్మనదేం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.