మహా పోలీసులపై కరోనా పంజా …కొత్తగా 222 మందికి కరోనా…ముగ్గురు మృతి

ముంబయి : మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు ఈ రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికంగా ఉంటుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా కట్టడికి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి పోరాడుతున్న పోలీసులపై కరోనా తన పంజా విసురుతోంది. గడిచిన రెండు రోజుల్లో మహారాష్ట్రలో 222 మంది పోలీసులకు కరోనా సోకగా, ముగ్గురు పోలీసులు చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,935 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. 74 మంది కరోనాతో చనిపోయారు. […] The post మహా పోలీసులపై కరోనా పంజా …కొత్తగా 222 మందికి కరోనా…ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు ఈ రాష్ట్రంలో కరోనా ఉధృతి అధికంగా ఉంటుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా కట్టడికి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి పోరాడుతున్న పోలీసులపై కరోనా తన పంజా విసురుతోంది. గడిచిన రెండు రోజుల్లో మహారాష్ట్రలో 222 మంది పోలీసులకు కరోనా సోకగా, ముగ్గురు పోలీసులు చనిపోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 5,935 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. 74 మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2, 30,599 మందికి కరోనా సోకింది. 9,667 మంది కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 93,654 యాక్టివ్ కేసలు ఉన్నాయి. వీరు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 1,27,259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. విధుల్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, విధిగా భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ లు దరించాలని పోలీసు ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి సూచిస్తున్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మహా పోలీసులపై కరోనా పంజా …కొత్తగా 222 మందికి కరోనా…ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: