నూతన దేవాలయం, మసీదును నిర్మిస్తాం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: తెలంగాణ సెక్రటరేట్ పాత భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న మందిరాలకు, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల సిఎం కెసిఆర్ విచారాన్ని, భాదను వ్యక్తం చేశారు. సెక్రటరేట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చివేసి కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నదని సిఎం స్పష్టం చేశారు. ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కెసిఆర్ […] The post నూతన దేవాలయం, మసీదును నిర్మిస్తాం: సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: తెలంగాణ సెక్రటరేట్ పాత భవనాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న మందిరాలకు, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల సిఎం కెసిఆర్ విచారాన్ని, భాదను వ్యక్తం చేశారు. సెక్రటరేట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో విశాలంగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చివేసి కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నదని సిఎం స్పష్టం చేశారు. ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదని కెసిఆర్ చెప్పారు.

దేవాలయం, మసీదు నిర్వాహకులతో తానే స్వయంగా సమావేశమవుతానన్నారు ముఖ్యమంత్రి. కొత్త సెక్రటరేట్ భవన సమూదాయంతో పాటు ప్రార్థన మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రం అన్న సిఎం ఎట్టి పరిస్థితుల్లో లాకిక స్పూర్తిని కొనసాగుతామని ప్రకటించారు. మందిరం, మసీదులను ప్రభుత్వ ఖర్చుతో నిర్మించడానికి సిఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. నూతన సెక్రటరేట్  భవనాన్ని అధునాత స్థాయిలో నిర్మించడంతో ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని హోంమంత్రి తెలిపారు.

We will build temples and mosques at govt expense Says CM KCR

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నూతన దేవాలయం, మసీదును నిర్మిస్తాం: సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: