అంగారక గ్రహంపై మళ్లీ క్యూరియాసిటీ జర్నీ

న్యూయార్క్: అంగారక గ్రహం ఉపరితలంపై మళ్లీ నాసా క్యూరియాసిటీ రోవర్ వేసవి ప్రయాణం ఈ నెల 6 న ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో రోవర్ ఏడాది మొత్తం మీద 1.6 కిమీ దూరం పూర్తి చేయవలసి ఉంటుంది. 6న తన ప్రయాణం ప్రారంభించాక తన కొత్త గమ్యం తాలూకు చిత్రాలను పంపించింది. ఈ మిషన్ ఉద్దేశం ఏమిటంటే మరో దశ ప్రయాణం ప్రారంభించే ముందు భారీ ఎత్తున పేరుకుపోయిన ఇసుక దిబ్బల్లో చిక్కుకోకుండా మార్గాన్ని సుగమం చేసుకోవడమే. […] The post అంగారక గ్రహంపై మళ్లీ క్యూరియాసిటీ జర్నీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూయార్క్: అంగారక గ్రహం ఉపరితలంపై మళ్లీ నాసా క్యూరియాసిటీ రోవర్ వేసవి ప్రయాణం ఈ నెల 6 న ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో రోవర్ ఏడాది మొత్తం మీద 1.6 కిమీ దూరం పూర్తి చేయవలసి ఉంటుంది. 6న తన ప్రయాణం ప్రారంభించాక తన కొత్త గమ్యం తాలూకు చిత్రాలను పంపించింది. ఈ మిషన్ ఉద్దేశం ఏమిటంటే మరో దశ ప్రయాణం ప్రారంభించే ముందు భారీ ఎత్తున పేరుకుపోయిన ఇసుక దిబ్బల్లో చిక్కుకోకుండా మార్గాన్ని సుగమం చేసుకోవడమే. మిషన్‌లో తరువాతి భాగం మౌంటైన్. మౌంటైన్ షార్ప్ అని దీన్ని పిలుస్తారు. మౌం టైన్ షార్ప్‌పై ప్రస్తుతం ఉన్న అవక్షేపాలను పూర్తిగా ఈ మిషన్ విశ్లేషిస్తుంది.

మార్స్ రోవర్ ఇటీవల పంపిన 116 చిత్రాలు పరిశీలిస్తే పెద్ద బిలం (గేల్ క్రేటర్ ) వైపు వెళ్లడానికి రోవర్ దారి ఏర్పర్చుకున్నట్టు స్పష్టమౌతోంది. దీనివల్ల మూడు మిలియన్ సంవత్సరాల క్రితం వాతావరణంలో వచ్చిన మార్పుకు సంబంధించి కీలక సమాచారం తెలుస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మౌంటైన్ షార్ప్ అవక్షేపాల పొరపై ప్రయాణం అంగారక గ్రహం వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీస్తుందని అలాగే, ఒకనాడు భూగోళంలా సముద్రాలు, సరస్సులు, వంటి వాటితో నిండి ఉండే అంగారక గ్రహం తరువాత గడ్డకట్టిన ఎడారిలా మారిపోడానికి దారి తీసిన కారణాలు ఏమిటో తెలుస్తాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అంగారక గ్రహంపై మళ్లీ క్యూరియాసిటీ జర్నీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: