ప్రచండ-ఓలీ నువ్వానేనా

  చీలిక దిశలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నేడు కీలకమైన స్థాయీ సంఘం భేటీ అధికార పంపిణీతో రాజుకున్న రగడ ఖాట్మండూ : పొరుగుదేశం నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలే దిశలో ఉంది. నేపాల్ ప్రధాని ఖడ్డ ప్రసాద్ ఓలి, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షులు పుష్పా కమాల్ ప్రచండల మధ్య జరిగిన చర్చలలో ఎటువంటి పురోగతి కన్పించలేదు. ఓలి తరచూ భారత వ్యతిరేక వైఖరికి […] The post ప్రచండ-ఓలీ నువ్వానేనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చీలిక దిశలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీ
నేడు కీలకమైన స్థాయీ సంఘం భేటీ
అధికార పంపిణీతో రాజుకున్న రగడ

ఖాట్మండూ : పొరుగుదేశం నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలే దిశలో ఉంది. నేపాల్ ప్రధాని ఖడ్డ ప్రసాద్ ఓలి, నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షులు పుష్పా కమాల్ ప్రచండల మధ్య జరిగిన చర్చలలో ఎటువంటి పురోగతి కన్పించలేదు. ఓలి తరచూ భారత వ్యతిరేక వైఖరికి దిగడం, దేశంలోని చైనా రాయబారి హో యాంక్వీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం వంటి పరిణామాలపై పార్టీలో అంతర్గత కలహాలు శృతి మించాయి. కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రచండతో ఓలీ వారంలో దాదాపుగా అరడజన్ సార్లు భేటీ అయ్యారు. అయితే ఇప్పటికీ ఎటువంటి ఏకాభిప్రాయం కుదరలేదని, ఇక పార్టీ చీలిక దిశలో వెళ్లుతోందని స్థానిక మీడియా వర్గాలు గురువారం తెలిపాయి.

బుధవారం ఎన్‌సిపికి చెందిన 45 మంది సభ్యులతో కూడిన స్థాయీ సంఘం సమావేశం జరగాల్సి ఉంది. అయితే దీనిని శుక్రవారానికి వాయిదా వేశారు. పార్టీలో రాజుకున్న అత్యున్నత స్థాయి విభేదాలను ముందుగా ప్రచండ, ఓలీలు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకున్న తరువాత స్టాండింగ్ కమిటీ భేటీకి కూర్చుంటే బాగుంటుందని పలుదఫాలుగా ఈ కమిటీ భేటీ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పటికీ ఇరువురి మధ్య ఎటువంటి సయోధ్య కుదరలేదని వెల్లడైంది. దీనితో శుక్రవారం ఖచ్చితంగా ఈ 68 ఏండ్ల ప్రధాని ఓలీ రాజకీయ భవితవ్యం తేలిపోతుందని భావిస్తున్నారు. పార్టీలో ప్రచండ వర్గీయులకే బలం ఉంది. ప్రపండకు సీనియర్ నేతలు, మాజీ ప్రధానులు మాధవ్ కుమార్ నేపాల్, జాలానాథ్ ఖన్నాల్ ఇతరులు మద్దతు ఉంది.

ఇక ఓలీ రాజీనామా చేయడం మంచిదని ప్రచండ వర్గీయులు పట్టుపడుతున్నారు. ప్రత్యేకించి ఇటీవలి ఆయన భారత వ్యతిరేక వ్యాఖ్యలు ఏ విధంగా చూసినా సమర్థనీయంగా లేవని, ఇవి దౌత్యపరంగా అనుచితంగా ఉన్నాయని, దేశ ప్రయోజనాకు భంగకరం అని విమర్శలు తలెత్తాయి. ఓలీ ప్రస్తుత వైఖరిని ప్రచండ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనితో ఇప్పుడు ఇరు పక్షాల మధ్య సమ రం తీవ్రం అయింది. పార్టీలో అధికార పంపిణీ, వ్యవహారాల పర్యవేక్షణ విషయంలో ఇరు పక్షాల మధ్య ఇటీవలి కాలంలో విభేదాలు తీవ్రతరం అయ్యాయి. ప్రధాని ఏకపక్షంగా పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌ను ప్రొరోగ్ చేశారని, ఇప్పటి కరోనా వైరస్ ఆటకట్టులో ప్రధాని పూర్తిగా విఫలం అయ్యారని ప్రచండ వర్గీయులు కత్తిదూస్తున్నారు.

తమతో ఏదీ మాట్లాడకుండా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ఇబ్బంది ఏర్పడుతోందని, పార్టీని కాదనే రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారని, ప్రధాని కన్నా పార్టీనే గొప్ప అని ప్రచండ అనుచరులు స్పష్టం చేస్తున్నారు. అయితే దేశ దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో ప్రధాని బాగా పనిచేస్తున్నారని, ఆయన విధాన నిర్ణయాలు బాగా ఉన్నాయని, వీటి విషయంలో ప్రభు త్వ సారథిగా ఆయనకు స్వేచ్ఛ ఉండాలని పార్టీలో ఆయ న అనుకూలురు తెలియచేస్తున్నారు. మరో వైపు ఓలీకి మద్దతుగా దేశంఓ కొన్ని చోట్ల ప్రదర్శనలు జరిగాయి. దీనికి వ్యతిరేకంగా ఖాట్మండూలోనే ఓ చోట ప్రపంచ అ నుకూల ర్యాలీ జరిగింది. ఇరు వర్గాల బలపరీక్షకు చివరికి వీధులలో వేదిక సిద్ధమైన పరిస్థితి ఏర్పడింది.

ఇది పరిస్థితిని మరింతగా దిగజార్చింది. ఓలికి మద్దతుగా ప్రదర్శనలు తీయడం పార్టీ అంతర్గత విషయాలలో కలుగచేసుకునేందుకు ఎవరో యత్నిస్తున్నట్లుగా ఉందని ఎస్‌సిపి ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ట తెలిపారు. పార్టీ చీలిపోదని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పునకుద్రోహం చేయబోమని శ్రేష్ట తెలిపారు. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలతో ఇరు పక్షాల మధ్య రాజీలేని పోరు నెలకొందని, శుక్రవా రం కీలక ఘట్టం ఉంటుందని, చీలికనే జరిగేలా ఉందని ఖాట్మాండు పోస్టు పత్రిక వార్తా కథనం వెలువరించింది.

NCP headed for split with Oli-Prachanda talks

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ప్రచండ-ఓలీ నువ్వానేనా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.