మర్కజ్ కేసులో విదేశీయులకు బెయిల్

  న్యూఢిల్లీ: ఢిల్లీ నిజాముద్దిన్ మర్కజ్ కేసుకు సంబంధించి 76 మంది విదేశీయులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎనిమిది దేశాలకు చెందిన వారు ఈ బెయిల్ పొందారు. కరోనా వైరస్ నియామావళి నేపథ్యంలో వీరు వీసా షరతులను ఉల్లంఘించి మర్కజ్‌కు హాజరయినట్లు, తద్వారా వైరస్ వ్యాప్తికి కారణం అయినట్లు అభియోగాలు ఉన్నాయి. వైరస్ కట్టడి దశలో మత ప్రచారానికి పాల్పడ్డారని, అక్రమంగా వ్యవహరించారని ఫిర్యాదులు అందాయి. కరోనా వ్యాప్తి తదితర అంశాలను పేర్కొంటూ స్థానిక […] The post మర్కజ్ కేసులో విదేశీయులకు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: ఢిల్లీ నిజాముద్దిన్ మర్కజ్ కేసుకు సంబంధించి 76 మంది విదేశీయులకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎనిమిది దేశాలకు చెందిన వారు ఈ బెయిల్ పొందారు. కరోనా వైరస్ నియామావళి నేపథ్యంలో వీరు వీసా షరతులను ఉల్లంఘించి మర్కజ్‌కు హాజరయినట్లు, తద్వారా వైరస్ వ్యాప్తికి కారణం అయినట్లు అభియోగాలు ఉన్నాయి. వైరస్ కట్టడి దశలో మత ప్రచారానికి పాల్పడ్డారని, అక్రమంగా వ్యవహరించారని ఫిర్యాదులు అందాయి. కరోనా వ్యాప్తి తదితర అంశాలను పేర్కొంటూ స్థానిక పోలీసులు వీరిపై చార్జీషీట్లు దాఖలు చేశారు.

ఈ క్రమంలో వీరి వాదనలను పరిశీలనలోకి తీసుకుని ఇప్పుడు వీరికి రూ 10,000 వ్యక్తిగత పూచీకత్తు షరతుతో బెయిల్ ఇస్తున్నట్లు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గుర్మోహినా కౌర్ తెలిపారు. తరువాత వీరు తమ అభ్యర్థనలను తెలియచేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లు న్యాయవాది అషిమా మండ్లా వివరించారు. కొందరు విదేశీ జాతీయుల తరఫున ఈ న్యాయవాది వాదించారు. తాము తెలిసో తెలియకో నేరం చేసినట్లు వీరు అంగీకరించినందున తక్కువ శిక్షలతో సరిపెట్టాలని కోరుతున్నట్లు న్యాయవాది తెలిపారు. మాలీ, నైజీరియా, శ్రీలంక , కెన్యా , టాంజానియా, దక్షణాఫ్రికా, మయన్మార్‌లకు చెందిన వారు మర్కజ్‌కు హాజరయ్యారు. ఇటువంటి కేసులలో సాధారణంగాఏడేళ్లు జైలు శిక్ష ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విదేశీ జాతీయులను కోర్టు ముందు హాజరుపర్చారు.

Delhi court grants bail to foreigners in Markaz case

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మర్కజ్ కేసులో విదేశీయులకు బెయిల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.