నిరుద్యోగ భృతితో ఆదుకోండి

  అమెరికాలో 13 లక్షల మంది దరఖాస్తు వాషింగ్టన్: అమెరికాలో తాజాగా 13 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కరోనా ఉధృతి, ఆర్థిక దిగ్బంధం నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. గత వారపు అధికారిక గణాంకాల మేరకు తమకు ఉపాధి పోయిందని, ఆదుకోవాలని ఈ 13 లక్షల మంది ట్రంప్ అధికార యంత్రాంగాన్ని వేడుకున్నారు. ట్రంప్ ఓ వైపు రీ ఓపెన్ అని ప్రకటనలు చేస్తూ ఉన్న వైరస్ తీవ్రత ఉన్న […] The post నిరుద్యోగ భృతితో ఆదుకోండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమెరికాలో 13 లక్షల మంది దరఖాస్తు

వాషింగ్టన్: అమెరికాలో తాజాగా 13 లక్షల మందికి పైగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కరోనా ఉధృతి, ఆర్థిక దిగ్బంధం నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. గత వారపు అధికారిక గణాంకాల మేరకు తమకు ఉపాధి పోయిందని, ఆదుకోవాలని ఈ 13 లక్షల మంది ట్రంప్ అధికార యంత్రాంగాన్ని వేడుకున్నారు. ట్రంప్ ఓ వైపు రీ ఓపెన్ అని ప్రకటనలు చేస్తూ ఉన్న వైరస్ తీవ్రత ఉన్న ఆరు రాష్ట్రాలలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు తిరిగి మూతపడ్డాయి. దీనితో లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగాలు పొయ్యాయి. అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్ రాష్ట్రాలే అమెరికా ఆర్థిక పరిపుష్టికి ఆయువుపట్టుగా నిలుస్తున్నాయి. ఇక్కడ కరోనా కారణంగా రీ ఓపెన్ జరగడం లేదు. ఇక మరో పదిహేను రాష్ట్రాలు ఇంతకు ముందు వ్యాపార కార్యకలాపాలను, ఆఫీసులను ప్రారంభించినా తిరిగి వాటిని మూసివేశాయి.

దీనితో మొత్తం మీద పలుచోట్ల లేఆఫ్‌లు వచ్చిపడ్డాయి. తాత్కాలికంగా పుంజుకున్న ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. మరింతగా ఉద్యోగాల కోత ఏర్పడుతుందని ఉద్యోగ శ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గత వారం 14 లక్షల మంది నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు కొంచెం తగ్గిందని అమెరికా కార్మిక విభాగం అధికారిక గణాంకాలతో వెల్లడైంది. దేశంలో వరుసగా 16 వారాల నుంచి పది లక్షల మందికి పైగా భృతి కోసం దరఖాస్తులు చేసుకుంటూ వస్తున్నారు. కరోనా రాకముందు ఓ వారంలో అత్యధిక సంఖ్యలో 7లక్షలకు పైగా ఈ భృతితో ఆదుకోవాలని విన్నవించుకున్నారు.

Over 13 lakhs workers filed for US Jobless benefits

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నిరుద్యోగ భృతితో ఆదుకోండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: