కరోనా చికిత్సలో ఇన్‌హేలెర్ ద్వారా రెమెడెసివిర్

  న్యూయార్క్ : కరోనా చికిత్సకు ఇన్‌హేలెర్ ద్వారా రెమెడెసివిర్‌ను ఉపయోగించే ప్రక్రియపై అధ్యయనం సాగిస్తున్నట్టు గిలీడ్ సైన్సెస్ సంస్థ ప్రకటించింది. ఆస్పత్రుల్లో కాకుండా బయట దీన్ని ఉపయోగించ గలిగేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది. ఆస్పత్రి వరకూ వెళ్ల వలసిన అవసరం లేని కేసులపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని, దీనికోసం 1845 సంవత్సరాల మధ్యనున్న అరవై మంది ఆరోగ్యవంతులైన అమెరికన్లను ఎంపిక చేస్తామని గిలీడ్ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం రెమెడెసివిర్ ఔషధాన్ని శరీరంలోని సిరల ద్వారా ఇస్తున్నామని, ఇప్పుడు […] The post కరోనా చికిత్సలో ఇన్‌హేలెర్ ద్వారా రెమెడెసివిర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూయార్క్ : కరోనా చికిత్సకు ఇన్‌హేలెర్ ద్వారా రెమెడెసివిర్‌ను ఉపయోగించే ప్రక్రియపై అధ్యయనం సాగిస్తున్నట్టు గిలీడ్ సైన్సెస్ సంస్థ ప్రకటించింది. ఆస్పత్రుల్లో కాకుండా బయట దీన్ని ఉపయోగించ గలిగేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పింది. ఆస్పత్రి వరకూ వెళ్ల వలసిన అవసరం లేని కేసులపై ఈ ట్రయల్స్ నిర్వహిస్తామని, దీనికోసం 1845 సంవత్సరాల మధ్యనున్న అరవై మంది ఆరోగ్యవంతులైన అమెరికన్లను ఎంపిక చేస్తామని గిలీడ్ సంస్థ ప్రకటించింది.

ప్రస్తుతం రెమెడెసివిర్ ఔషధాన్ని శరీరంలోని సిరల ద్వారా ఇస్తున్నామని, ఇప్పుడు నెబ్యులైజర్ ద్వారా ఇన్‌హేలర్ ప్రక్రియ నిర్వహిస్తామని చెప్పింది. ఆస్పత్రుల బయట ఇది సులువైన ప్రక్రియగా పేర్కొంది. ఆస్పత్రుల్లోని కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో రెమెడెసివిర్‌ను వినియోగించ వచ్చని అమెరికా అనుమతించింది. ఇన్‌హేలెర్ ప్రక్రియలో వ్యాధి ఎక్కడ కేంద్రీకృతమైందో అక్కడికే నేరుగా ఔషధాన్ని పంపిస్తారు.

Gilead starts testing inhaled version of remdesivir

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కరోనా చికిత్సలో ఇన్‌హేలెర్ ద్వారా రెమెడెసివిర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: