విపక్షాలది నీచరాజకీయం

  పైశాచిక ఆనందం కోసమే సిఎం కెసిఆర్‌పై విమర్శలు కరోనా కట్టడిలో జరిగే చిన్నచిన్న తప్పిదాలను భూతద్దంలో చూపడం సిగ్గుచేటు కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే ఆర్థికాభివృద్ధిని సాధించడమే లక్షం ప్రతిపక్షాల చిల్లరమల్లర రాజకీయాలు పట్టించుకోం : కరీంనగర్ జిల్లా పర్యటనలో మంత్రి కెటిఆర్ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, నేను ఇటీవల ఓ కార్యక్రమంలో కలిశాం. ముఖానికి మాస్కు వేసుకోవాలని చేతికిస్తే దానిని జేబులో పెట్టుకున్నడు. ఆ మార్నాడే ఆయనకు కరోనా సోకింది. వైరస్ బారిన పడకుండా మాస్క్‌లు […] The post విపక్షాలది నీచరాజకీయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పైశాచిక ఆనందం కోసమే సిఎం కెసిఆర్‌పై విమర్శలు
కరోనా కట్టడిలో జరిగే చిన్నచిన్న తప్పిదాలను భూతద్దంలో చూపడం సిగ్గుచేటు
కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే ఆర్థికాభివృద్ధిని సాధించడమే లక్షం
ప్రతిపక్షాల చిల్లరమల్లర రాజకీయాలు పట్టించుకోం : కరీంనగర్ జిల్లా పర్యటనలో మంత్రి కెటిఆర్

డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, నేను ఇటీవల ఓ కార్యక్రమంలో కలిశాం. ముఖానికి మాస్కు వేసుకోవాలని చేతికిస్తే దానిని జేబులో పెట్టుకున్నడు. ఆ మార్నాడే ఆయనకు కరోనా సోకింది. వైరస్ బారిన పడకుండా మాస్క్‌లు ధరించడం ప్రధానం. ఎలాంటి నిర్లక్షం చేసినా వైరస్ ఎటాక్ చేయడం ఖాయం. దీనికి పద్మారావుగౌడ్ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం.

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనాను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ వైఫల్యం చెందారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిదీ రాజకీయం చేయడం వారికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కరోనాతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్న సమయంలో కూడా ప్రతిపక్షాలు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతుండడం సిగ్గుచేటన్నారు. ఇంతనీచమైన రాజకీయాలు చేయడం మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలకే చెల్లిందన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు.

కరోనా నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు తీసుకుందన్నారు. దేశంలో పలు బిజెపి పాలిత రాష్ట్రంలో కూడా కరోనా తీవ్ర స్థాయిలో విలయం తాండవం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. దీనిపై తాము కూడా కేంద్రంపై దుమ్మెత్తిపోసే అవకాశమున్నప్పటికీ ఆరోపణలు, విమర్శలు చేయ టడానికి ఇది సరైన సమయం కాదని మౌనంగా ఉంటున్నామన్నారు. కానీ రాష్ట్రంలోని బిజెపి నేతలు మాత్రం అదే పనిగా కెసిఆర్‌పై విమర్శలు చేస్తుడడం.. వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శమన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తున్నప్పటికీ అక్కడక్కడ అరకొరగా జరిగిన తప్పిదాలను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తుండడం సిగ్గుచేటన్నారు.

కేవలం ప్రతిపక్షాలు తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలన్న దురుద్దేశ్యంతోనే కోవిడ్‌పై లేనిపోని అసత్యం ప్రచారం చేస్తూ సిఎం కెసిఆర్‌ను విమర్శంచడమే టార్గెట్‌గా పెట్టుకున్నారన్నారు. కాని వారిలా మేము రాజకీయాలు చేయదలుచుకోలేదన్నారు. కరోనా నుంచి ప్రజలను రక్షించడం… మరోవైపు అన్ని వర్గాల వారికి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను యథావిధిగా అందించడం… ఆర్ధికాభివృద్ధి సాధించి తిరిగి రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలు ఎక్కించడమే తమ లక్షమన్నారు. దీని కోసం ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర, మల్లర రాజకీయాలను పట్టించుకోమన్నారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post విపక్షాలది నీచరాజకీయం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.