ఫంక్షన్లపై ఆంక్షలు కఠినం

  అనుమతి లేకుండా విందు వినోదాలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించండి జిల్లాల ఎస్‌పిలు, స్థానిక పోలీసులకు డిజిపి ఆదేశాలు మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా విందు, వినోదాలు చేసుకుంటున్న వైనంపై డిజిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్రంలో అనుమతి లేకుండా పార్టీలు, విందులు నిర్వహిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్‌పిలకు బుధవారం నాడు డిజిపి ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు. […] The post ఫంక్షన్లపై ఆంక్షలు కఠినం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అనుమతి లేకుండా విందు వినోదాలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు
వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించండి
జిల్లాల ఎస్‌పిలు, స్థానిక పోలీసులకు డిజిపి ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా విందు, వినోదాలు చేసుకుంటున్న వైనంపై డిజిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్రంలో అనుమతి లేకుండా పార్టీలు, విందులు నిర్వహిస్తే నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్‌పిలకు బుధవారం నాడు డిజిపి ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు. వ్యాప్తంగా ఫంక్షన్ల, వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్‌పిలకు ఇచ్చిన ఆదేశాలలో పేర్కొన్నారు. ఇటీవల కాలంలో సడలించాక కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఎన్నివిధాలుగా అవగాహన కల్పిస్తున్నా కొందరు నిబంధనలను పెడచెవిన పెడుతుండటంపై డిజిపి సీరియస్ అయ్యారు. తాజాగా నగరం లో ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి బంధువు హోటల్లో రేవ్‌పార్టీ, మరో వ్యాపారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే.

అలాగే ఎల్‌బి నగర్‌లో ఓ బర్త్‌డే కారణంగా వైరస్ సోకిందని, అలాగే ఓ పార్ట్‌మెంట్‌లోనూ బర్త్‌డే కారణంగా కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ఫంక్షన్ల అనుమతి కోసం వచ్చిన వారికి వివరించాలని డిజిపి సూచించారు. అలాగే ధూల్‌పేటలో ఓ వివాహ కార్యక్రమంలో 20మందికి ఒకేసారి కరోనా సోకిందని, ఇలాంటివి నివారించేందుకు ఫంక్షన్ల అనుమతులను కఠిన తరం చేయాలని పోలీసు బాసులు నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో పార్టీలు, విందుల అనుమతులను కఠినతరం చేయనున్నారు. ముందస్తు అనుమతి లేకుండా చేపట్టే ఇలాంటి వేడుకలను ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే పోలీస్‌స్టేషన్లలోకి వచ్చే ఫిర్యాదుదారులు మాస్కులేకుండా వచ్చినా గుంపులుగా ప్రవేశించినా ఎపిడమిక్ యాక్ట్ 51(బి) ప్రకారం కేసుల నమోదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.

పోలీసు అనుమతి ఉంటేనే ఫంక్షన్ హాల్
పోలీసుల అనుమతి లేకుండా ఏలాంటి ఫంక్షన్ల, వేడులకలను నిర్వహించరాదని, కరోనా నిబంధనలను ఉల్లంఘిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు బాసులు ఆదేశాలివ్వడంతో స్థానిక పోలీసులు ఫంక్షన్లపై నిఘా సారిస్తున్నారు. రాష్ట్రంలోని ఫంక్షన్ హాల్స్ యజమానులకు స్థానిక పోలీసులు సూచనలతో కూడిన పత్రాలను ఇప్పటికే అందజేశారు. పోలీసుల అనుమతి పత్రం ఉంటేనే వారికి ఫంక్షన్ హాల్స్ అద్దెకు ఇవ్వాలని ఆ ఆదేశాలలో స్పష్టంగా పేర్కొన్నారు. కరోనా వేగంగా వ్యప్తి చెందుతున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఫంక్షన్లను నిర్వహించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా అనుమతిలేని ఫంక్షన్ల నిర్వహకులతో పాటు ఫంక్షన్లకు వచ్చిన వారిపైనా కేసులు నమోదు చేయనున్నారు.

భౌతిక దూరం పాటించడం వల్ల కరోనా వైరస్ విస్తరించకుండా నివారించవచ్చన్న ఉద్దేశ్యంలో ఫంక్షన్లపై ఆంక్షలు విధించినట్లు పోలీసులు వివరిస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వివాహాలు తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని, లేనిపక్షంలో కరోనా నిబంధనల మేరకు కొద్దిమందితో కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. ఫంక్షన్లలో ఒకేచోట మంది గుమిగూడటం వల్ల వైరస్ మరింత విస్తరిస్తోందని, లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా పెళ్లిళ్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన నిబంధలను ఉల్లంఘించి ఫంక్షన్లు నిర్వహిస్తే వారిని క్వారంటైన్‌కు తరలించాలని పోలీసులు సమాలోచనలు సాగిస్తున్నారు.

ఈక్రమంలో శుభ, అశుభ కార్యాక్రమాలను పోలీసు అనుమతితోనే నిర్వహించుకోవాలని, లేనిపక్షంలో నిర్వహకులు, ఆయా ఫంక్షన్లకు హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు బాసులు వివరిస్తున్నారు. అతి కొద్ది మందితో భౌతిక దూరం పాటిస్తూ చేసుకోవాలని, దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ఉంటుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వేడుకలను వాయిదా వేసుకోవడమే మంచిదని, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు తమ వంతు సహాయసహకారాలు అందించాలని పోలీసు బాసు కోరుతున్నారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఫంక్షన్లపై ఆంక్షలు కఠినం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: