రాష్ట్రవ్యాప్తంగా 1924 కొత్త కేసులు

  11 మంది మృతి, జిహెచ్‌ఎంసిలో 1,590 హైకోర్టులోనూ కరోనా కలకలం, పది మందికి పాజిటివ్, యథావిధిగా కోర్టు పనులు వైరస్ దాడిలో పదకొండు మంది మృతి జిహెచ్‌ఎంసిలో 1590, జిల్లాల్లో 334 మందికి వైరస్ ఉస్మానియా సూపరింటెండెంట్‌కు కరోనా 29536కు చేరిన కరోనా బాధితుల సంఖ్య మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాజిటివ్ రేట్ అమాంతంగా పెరుగుతోంది. బుధవారం 6363 మందికి టెస్టులు చేయగా, ఏకంగా 1924 మందిలో వైరస్ తేలింది. ఇప్పటి వరకు నమోదైన […] The post రాష్ట్రవ్యాప్తంగా 1924 కొత్త కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

11 మంది మృతి, జిహెచ్‌ఎంసిలో 1,590
హైకోర్టులోనూ కరోనా కలకలం, పది మందికి పాజిటివ్, యథావిధిగా కోర్టు పనులు
వైరస్ దాడిలో పదకొండు మంది మృతి
జిహెచ్‌ఎంసిలో 1590, జిల్లాల్లో 334 మందికి వైరస్
ఉస్మానియా సూపరింటెండెంట్‌కు కరోనా
29536కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పాజిటివ్ రేట్ అమాంతంగా పెరుగుతోంది. బుధవారం 6363 మందికి టెస్టులు చేయగా, ఏకంగా 1924 మందిలో వైరస్ తేలింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో ఇవే గరిష్ఠం. అంటే ఈ ఒక్కరోజులో పాజిటివ్ రేట్ 30.23గా నమోదైంది. టెస్టులు చేస్తున్న ప్రతి 100 మందిలో ముప్పై మందికి వైరస్ తేలుతుంది. ఈ విధమైన పాజిటివ్ రేట్ ప్రస్తుతం మరే రాష్ట్రంలోనూ నమోదుకావడం లేదని స్వయంగా వైద్యాధికారులే పేర్కొనడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు వైరస్ దాడిలో మరణించిన వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది.

బుధవారం ఒక్క రోజే 11 మంది చనిపోవడం భయాందోళన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 1590 మంది ఉండగా, రంగారెడ్డిలో 99, మేడ్చల్ 43, సంగారెడ్డి 20, కరీంనగర్ 14, మహబూబ్‌నగర్ 15, కామారెడ్డి 3, నల్గొండ 13, వరంగల్ రూరల్ 26, వరంగల్ అర్బన్ 7, నిజామాబాద్ 19, వికారాబాద్ 11, మెదక్ 5, పెద్దపల్లి 5, సూర్యాపేట్ 7, ఖమ్మం 4, జగిత్యాల 3, భద్రాది 5, సిరిసిల్లా 13, ఆదిలాబాద్ 3, ఆసిఫాబాద్ 1, నాగర్‌కర్నూల్ 3, వనపర్తి 9, యాదాద్రి 5, నారాయణపేట్ జిల్లాలో మకోకరు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 29536కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 17279కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 11933మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 324కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే కొత్తగా వైరస్ సోకిన వారిలో ఉస్మానియా సూపరింటెండెంట్ డా నాగేంద్ర ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

1924 new COVID-19 cases reported in last 24 hrs

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రాష్ట్రవ్యాప్తంగా 1924 కొత్త కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: