యాంటీజెన్ టెస్టులు షురూ

  లక్షణాలున్న వారికి, ప్రైమరీ కాంటాక్టులకే పరీక్షలు 90 కేంద్రాల్లో 2 లక్షల నమూనాల నిర్ధారణ అర్బన్ పిహెచ్‌సి కేంద్రాల్లో శాంపిళ్ల సేకరణ 15 నుంచి 30 నిమిషాల్లోనే పరీక్ష ఫలితం ఫలితాల పారదర్శకతను బట్టి టెస్టుల సంఖ్య పెంపు మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా యాంటిజెన్ టెస్టులు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా కేవలం 15 నుంచి 30 నిమిషాల్లోనే వైరస్ సోకిందా? లేదా అనేది తేలుతుందని అధికారులు అంటున్నారు. అతి తక్కువ సమయంలో వైరస్ లోడ్‌ను […] The post యాంటీజెన్ టెస్టులు షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లక్షణాలున్న వారికి, ప్రైమరీ కాంటాక్టులకే పరీక్షలు
90 కేంద్రాల్లో 2 లక్షల నమూనాల నిర్ధారణ
అర్బన్ పిహెచ్‌సి కేంద్రాల్లో శాంపిళ్ల సేకరణ
15 నుంచి 30 నిమిషాల్లోనే పరీక్ష ఫలితం
ఫలితాల పారదర్శకతను బట్టి టెస్టుల సంఖ్య పెంపు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా యాంటిజెన్ టెస్టులు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా కేవలం 15 నుంచి 30 నిమిషాల్లోనే వైరస్ సోకిందా? లేదా అనేది తేలుతుందని అధికారులు అంటున్నారు. అతి తక్కువ సమయంలో వైరస్ లోడ్‌ను తెలుసుకునేందుకు ఈ టెస్టు బాగా ఉపయోగపడుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తొలి విడత కేసుల తీవ్రత అధికంగా ఉన్న జిహెచ్‌ఎంసి పరిధిలోని 90 కేంద్రాల్లో సుమారు 2 లక్షల శాంపిల్స్‌కు టెస్టు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వైద్యశాఖ తెలిపింది.

అయితే ప్రస్తుతం వారియర్స్, ప్రైమరీ కాంటాక్ట్‌లకు, కరోనా లక్షణాలు ఉన్న వారికి మాత్రమే నిర్ధారణ చేస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. అర్బన్ పిహెచ్‌సి కేంద్రాల్లో శాంపిల్ సేకరణ కార్యక్రమం జరుగుతుందని, ప్రతి కేంద్రంలో సుమారు 25 మందికి మాత్రమే టెస్టులు చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. ఆ తర్వాత ఫలితాల పారదర్శకతను బట్టి రాబోయే రోజుల్లో టెస్టులు సంఖ్యను పెంచుతామని వైద్యాశాఖ ఉన్నతాధికారుల్లో ఒకరు మన తెలంగాణకు తెలిపారు.

టెస్టు ఇలా చేస్తారు…
కరోనా యాంటిజెన్ టెస్టుల ద్వారా వైరస్ లోడ్‌ను వేగంగా తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ కిట్లలో స్వాబ్, బ్లడ్ శాంపిల్ సేకరణ ద్వారా కూడా టెస్టులు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చేస్తున్న కరోనా యంటిజెన్ టెస్టులకు కేవలం స్వాబ్‌ను మాత్రమే సేకరిస్తున్నట్లు ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ , ఐపిఎం డైరెక్టర్ డా శంకర్ పేర్కొన్నారు. టెస్టులో భాగంగా ఆర్‌టిపిసిఆర్‌కి సేకరించినట్లు గొంతు, ముక్కు నుంచి స్వాబ్ తీయాల్సిన అవసరం లేదని, కరోనా లక్షణాలు ఉన్న బాధితుడి ముక్కు నుంచి మాత్రమే స్వాబ్ తీస్తారని ఆయన చెప్పారు. ఆ శాంపిల్‌ను యాంటిజెన్ టెస్ట్ కిట్ మీద ఉంచితే తర్వాత 15 నుంచి 30 నిమిషాల్లో వైరస్ లోడ్‌ను బట్టి కిట్‌లో లిక్విడ్స్ రంగులు మారుతుందని, ఆ కలర్స్ ద్వారా పాజిటివా? నెగటివా? అని నిర్ధారిస్తామని వైరాలజీ నిపుణులు చెబుతున్నారు.

అయితే పాజిటివ్ వస్తే మరోసారి ఆర్‌టిసిపిఆర్ చేయాల్సిన అవసరం లేదని, నెగటివ్ వస్తే మాత్రమే కన్ఫామ్ కోసం ఆర్‌టిపిసిఆర్‌కు పంపుతామని డా.శంకర్ తెలిపారు. మంగళవారం ఫీవర్ ఆసుపత్రికి 1500 కిట్లు వచ్చాయని, బుధవారం నాడు ఒపికి వచ్చిన వారికి ఈ కిట్లను ఉపయోగించి టెస్టులు చేశామని ఆయన అన్నారు. అయితే ఎంత మందికి పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని తెలుపలేదు. మరోవైపు శేరిలింగంపల్లి పరిధిలోని ఓ అర్బన్ పిహెచ్‌సిలో 25 మందికి యాంటిజెన్ టెస్టులు చేయగా, నలుగురికి పాజిటివ్ తేలినట్లు సమాచారం. అయితే బుధవారం ఎక్కడెక్కడ యంటిజెన్ టెస్టులు కార్యక్రమం జరిగింది? ఎంత మందికి చేశారు? ఎన్ని కేంద్రాల్లో ప్రారంభమైంది? అనే వివరాలు వైద్యశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. చాలా మంది వైద్యశాఖ అధికారులకు ఈ టెస్టులు జరుగుతున్నట్లు సమాచారం తేలియకపోవడం గమనార్హం. టెస్టుల పట్ల గోప్యత ఉంచడంలో వైద్యశాఖ అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. అయితే యంటిజెన్ పాజిటివ్ వివరాలను బులెటెన్‌లో కలుపుతున్నారా? లేదా అనే విషయంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

యంటిబాడీ టెస్టులకూ సర్కార్ సుముఖం
రాష్ట్రంలో యంటిబాడీ టెస్టులకు చేసేందుకు కూడా సర్కార్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. సుమారు 25వేల మందికి టెస్టులు చేసి వైరస్ వాప్తిని అంచనా వేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధమైనట్లు అధికారులు తెలిపారు. అయితే యాంటిజెన్(ప్రతిజనకం) ద్వారా మన శరీరంలో రోగ కారకాన్ని గుర్తించవచ్చని, ఒకవేళ రోగ కారకం ప్రవేశిస్తే వెంటనే దాన్ని ఎదుర్కొనేందుకు యాంటిబాడీస్(ప్రతిరక్షకాలు) అభివృద్ధి అవుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వైరస్ సోకిన గంటల కొద్ది సమయంలోనే యాంటిజెన్ టెస్టు చేస్తే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుందని అధికారులు తెలిపారు. ఈ వైరస్ కారకాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి రక్షకాలు అభివృద్ధి అయితే యంటిబాడీ టెస్టుల్లో తేలుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 25 వేల కిట్లకు అర్డర్ కూడా పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ టెస్టుల ద్వారా ప్రజల్లో ఉండే భయం, అపోహలను తొలగించవచ్చని ఓ అధికారి అన్నారు.

Soon, Telangana to conduct rapid antigen tests

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post యాంటీజెన్ టెస్టులు షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: