హైదరాబాద్ లో మరో దారుణం.. సెల్ఫీ వీడియోలో డాక్టర్ కన్నీరుమున్నీరు..

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఓ వైపు మహమ్మారి కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు అదే కరోనాకు చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు లక్షల్లో బిల్లులు వేస్తూ కరోనా పేషెంట్లను వేధిస్తున్నారు. ఇటీవల ఓ డాక్టర్ కరోనాతో చాదర్ ఘట్ లోని తుంబా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే లక్షల్లో బిల్లులు వేసి.. మొత్తం బిల్లు కడితేనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో సెల్ఫీ వీడియో ద్వారా తనకు న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకుంది. తాజాగా ఇలాంటి ఘటనే నగరంలోని ఎఐజి ప్రైవేట్ ఆస్పత్రిలో […] The post హైదరాబాద్ లో మరో దారుణం.. సెల్ఫీ వీడియోలో డాక్టర్ కన్నీరుమున్నీరు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ః రాష్ట్రంలో ఓ వైపు మహమ్మారి కరోనా విజృంభిస్తుంటే.. మరోవైపు అదే కరోనాకు చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు లక్షల్లో బిల్లులు వేస్తూ కరోనా పేషెంట్లను వేధిస్తున్నారు. ఇటీవల ఓ డాక్టర్ కరోనాతో చాదర్ ఘట్ లోని తుంబా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే లక్షల్లో బిల్లులు వేసి.. మొత్తం బిల్లు కడితేనే డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో సెల్ఫీ వీడియో ద్వారా తనకు న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకుంది. తాజాగా ఇలాంటి ఘటనే నగరంలోని ఎఐజి ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకడంతో ఎఐజి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన డాక్టర్‌ విజయ్ కేసరికు దావఖానా సిబ్బంది నరకం చూపింది. ఇటీవల డాక్టర్ విజయ్ కేసరికి కరోనా పాజిటీవ్ రావడంతో మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఎఐజి ప్రైవేట్ ఆస్పతిలో చేరింది. అయితే.. వెంటిలేటర్, ఆక్సిజన్ పెట్టకపోయినా.. పెట్టినట్లు చూపించి భారీగా బిల్లులు వసూలు చేయడంతో ఇంత దారుణం ఏంటని ఆమె ప్రశ్నించింది. దీంతో సరైన వైద్య అందించకుండా ఆమె పట్ల ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గంగా ప్రవర్తిచింది. దీంతో 14 రోజులుగా తనకు ఆస్పత్రి సిబ్బంది నరకం చూపించారని సదరు డాక్టర్ సెల్ఫీ వీడియోలో కన్నీరుమున్నీరయ్యారు. దయచేసి తనకు సహాయం చేయాలని వీడియో ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను వేడుకొంది.

corona infected lady doctor accuses private hospital in Hyd

 

 

The post హైదరాబాద్ లో మరో దారుణం.. సెల్ఫీ వీడియోలో డాక్టర్ కన్నీరుమున్నీరు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.