గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడి ఎన్‌కౌంటర్‌..

లక్నోః గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబేను యూపి పోలీసులు హతమార్చారు. కాన్పూర్‌లో 8మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే, అతని అనుచరులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో ఓ ఎస్పి, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుల్‌లు మృతి చెందారు. దీంతో పోలీసులు 25 ప్రత్యేక బృందాలుగా విడిపోయి నింధితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఉత్తర్‌ప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో వికాస్ ప్రధాన అనుచరుడు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న యూపి స్పెషల్ […] The post గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడి ఎన్‌కౌంటర్‌.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లక్నోః గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబేను యూపి పోలీసులు హతమార్చారు. కాన్పూర్‌లో 8మంది పోలీసులను గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే, అతని అనుచరులు విచక్షణారహితంగా కాల్చి చంపారు. ఈ ఘటనలో ఓ ఎస్పి, ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుల్‌లు మృతి చెందారు. దీంతో పోలీసులు 25 ప్రత్యేక బృందాలుగా విడిపోయి నింధితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఉత్తర్‌ప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలోని ఓ ప్రాంతంలో వికాస్ ప్రధాన అనుచరుడు తలదాచుకున్నట్లు సమాచారం అందుకున్న యూపి స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు  బుధవారం ఉదయం అక్కడకు వెళ్లగా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో అమర్ దూబే చనిపోయినట్లు రాష్ట్ర అదనపు డిజిపి ప్రశాంత్ కుమార్ తెలిపారు. ప్రధాన నింధితుడు వికాస్ దూబే కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Close aide of Vikas Dubey killed in encounter in Hamirpur

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడి ఎన్‌కౌంటర్‌.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.