చిన్న వయసులోనే ప్రేమ అనుభూతి..

హైదరాబాద్‌లో పుట్టిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ముంబయ్‌లో పెరిగి అక్కడే సెటిలైంది. ‘మున్నా మైఖేల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన నిధి.. నాగచైతన్య సరసన ’సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆతర్వాత అఖిల్ హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’లో కనిపించింది. ఇక గత ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కెరీర్‌లో మొదటి హిట్‌ను అందుకుంది. ఇక అవకాశాల కోసం గ్లామర్ షో చేయాలని గ్రహించి గ్లామర్ డోస్ పెంచేసింది. ఇక […] The post చిన్న వయసులోనే ప్రేమ అనుభూతి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌లో పుట్టిన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ముంబయ్‌లో పెరిగి అక్కడే సెటిలైంది. ‘మున్నా మైఖేల్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన నిధి.. నాగచైతన్య సరసన ’సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆతర్వాత అఖిల్ హీరోగా నటించిన ‘మిస్టర్ మజ్ను’లో కనిపించింది. ఇక గత ఏడాది పూరీ జగన్నాథ్ దర్శకత్వలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో కెరీర్‌లో మొదటి హిట్‌ను అందుకుంది. ఇక అవకాశాల కోసం గ్లామర్ షో చేయాలని గ్రహించి గ్లామర్ డోస్ పెంచేసింది. ఇక ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటున్న ఈ భామ ఇటీవల తన లవ్.. బ్రేకప్.. క్రష్.. గురించిన వివరాలు బయట పెట్టేసింది.

చిన్నప్పుడు స్కూల్లో నాలుగవ తరగతి చదివేటప్పుడే.. మొదటిసారి ఒక అబ్బాయితో ప్రేమలో పడిందట నిధి. అలా చిన్న వయసులోనే ప్రేమ అనుభూతి పొందిన అమ్మడు తన ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయిందట. ఆ తర్వాత కాలేజ్ టైంలో మరొక అబ్బాయితో డేటింగ్ కి వెళ్లినట్లు ఒప్పేసుకుంది భామ. ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్ ఎప్పటికీ మరచిపోలేనని చెబుతోంది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం ప్రేమలో ఉందా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఇక తన సెలబ్రిటీ క్రష్ గురించి చెబుతూ… బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ అంటే పిచ్చి అని పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు గల్లా అశోక్ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Nidhi Agarwal opens up her love and crush

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post చిన్న వయసులోనే ప్రేమ అనుభూతి.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: