ఘనంగా ధోనీ @39 జన్మదిన వేడుకలు…

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మంగళవారం 39వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక జన్మదిన వేడుకలను అతని అభిమానులు, సహచరులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్ సహచరులు అయి తే ఈ జన్మదిన వేడుకలను మరింత జరిపారు. ధోనీ సహచరుడు, విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఈ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక వీడియో మహి అభిమానులను అలరిస్తోంది. ధోనీ ని ప్రాణంగా ప్రేమించే బ్రావో అతని కోసం హెలికాప్టర్ పేరుతో సరికొత్త […] The post ఘనంగా ధోనీ @39 జన్మదిన వేడుకలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మంగళవారం 39వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక జన్మదిన వేడుకలను అతని అభిమానులు, సహచరులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్‌కింగ్స్ సహచరులు అయి తే ఈ జన్మదిన వేడుకలను మరింత జరిపారు. ధోనీ సహచరుడు, విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఈ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక వీడియో మహి అభిమానులను అలరిస్తోంది. ధోనీ ని ప్రాణంగా ప్రేమించే బ్రావో అతని కోసం హెలికాప్టర్ పేరుతో సరికొత్త పాటను విడుదల చేశాడు. బ్రావో పాడిన ఈపాట ధోనీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది. ధోనీ సాధించిన విజయాలను పొగుడుతూ బ్రావో ఈ పాటను రూపొందించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

అభినందనల వెల్లువ
ఇక జన్మదినాన్ని పురస్కరించుకుని ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది. సతిమణి సాక్షి ధోనీతో సహా మాజీ సహచరులు, ప్రస్తు త ఆటగాళ్లు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవా రం కూతురు జీవా, భార్య సాక్షితో కలిసి ధోనీ జన్మదినాన్ని జరుపుకున్నాడు. కరోనా నేపథ్యంలో కొద్ది మంది మాత్రమే ఈ వేడుకలకు హాజరయ్యా రు. ఇక భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ధోనీకి అభినందనలు తెలిపాడు. ఈ మేరకు ధోనీ సాధించిన ఘనతలను గుర్తు చేసుకుంటూ బిసిసిఐ ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా టీమిండియా కు ధోనీ చేసిన సేవలను నెమరేసుకున్నారు. మరోవైపు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహి త్ శర్మ, సీనియర్ క్రికెటర్లు సురేశ్ రైనా, హర్భజన్, ఇర్ఫాన్, అశ్విన్ తదితరులు కూడా ధోనీకి జన్మది న శుభకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అంతేగాక చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం కూడా ధోనీని ప్రత్యేకంగా అభినందించింది.

MS Dhoni’s 39th birthday celebrations

The post ఘనంగా ధోనీ @39 జన్మదిన వేడుకలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.