విపక్షాలది మూర్ఖత్వం

  ప్రజలకు సత్వర సేవలందించేందుకే కొత్త సచివాలయం హైదరాబాద్‌లో సెక్షన్ 8 విధించాలన్న ఉత్తమ్ డిమాండ్ ఆయన అజ్ఞానానికి నిదర్శనం నూతన సెక్రటేరియట్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు మంత్రులు జగదీష్, తలసాని, విప్ పల్లా ధ్వజం మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిపక్షాల తీరు మూర్ఖత్వానికి పరాకాష్టగా మారిందని రాష్ట్ర మంత్రులు జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు పి.రాములు, శాసనమండలి సభ్యుడు ఎం. శ్రీనివాస్ రెడ్డి […] The post విపక్షాలది మూర్ఖత్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రజలకు సత్వర సేవలందించేందుకే కొత్త సచివాలయం
హైదరాబాద్‌లో సెక్షన్ 8 విధించాలన్న ఉత్తమ్ డిమాండ్ ఆయన అజ్ఞానానికి నిదర్శనం
నూతన సెక్రటేరియట్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు
మంత్రులు జగదీష్, తలసాని, విప్ పల్లా ధ్వజం

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రతిపక్షాల తీరు మూర్ఖత్వానికి పరాకాష్టగా మారిందని రాష్ట్ర మంత్రులు జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు పి.రాములు, శాసనమండలి సభ్యుడు ఎం. శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. ప్రజలకు సేవలు వేగంగా అందించేందుకు సమీకృత సచివాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే కాంగ్రెస్‌కు ఎందుకు ఏడుస్తోందని వారు నిందించారు. నూతన సచివాలయాన్ని నిర్మిస్తామని టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో ప్రకటిస్తే ప్రజలు మద్దతు ఇచ్చి టిఆర్‌ఎస్‌ను గెలిపించారని వారు చెప్పారు. టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జి. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తాజా వ్యాఖ్యాలు బానిసత్వానికి నిదర్శనంగా ఉన్నాయని విమర్శించారు.

ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావంతో ఆయన అధికారం పోయిందనే భావనలో ఉత్తమ్ ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8 విధించాలని ఉత్తమ్ అజ్ఞానపు డిమాండ్ చేస్తున్నారని నిందించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఉన్నప్పుడు సెక్షన్ 8 ప్రస్తావన అర్థ రహితమని జగదీష్ రెడ్డి చెప్పారు. సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో ముందుకు దూసుకు పోవడం కాంగ్రెస్, బిజెపి తదితర రాజకీయ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. కెసిఆర్ పాలన దేశానికి రోల్‌మోడల్‌గా ఉందన్నారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రభాగాన ఉందని ఆయన గుర్తు చేశారు. రైతు బంధు పథకం కాంగ్రెస్ అధికారంలో ఎందుకు అమలు చేయలేదని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. కరోనా కంటే దరిద్రమైన పార్టీ కాంగ్రెస్‌పార్టీ అని ఆయన నిందించారు. ఉత్తమ్‌ను ఆ పార్టీ నాయకులే వద్దు అంటున్నారన్నారు.

సచివాలయ నిర్మాణం ఆగదు
కాంగ్రెస్‌తో పాటు ఏ రాజకీయపార్టీ నీచ రాజకీయాలు చేసినా నూతన సచివాలయ నిర్మాణం ఆగదని రాష్ట్ర పశుసంవర్థక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సచివాలయ నిర్మాణం తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయమని విపక్షాలు గ్రహించాలని చెప్పారు. ఢిల్లీలో నూతన పార్లమెంట్ కట్టాలని కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మత రాజకీయాలు తప్ప బిజెపికి ప్రజాసంక్షేమం అవసరం లేదన్నారు. కెసిఆర్ పాలన దేశానికి ఆదర్శనీయంగా ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా బిజెపి, కాంగ్రెస్ దిక్కుమాలిన రాజకీయాలు మాని ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలని ఆయన చెప్పారు.

పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన సచివాలయం
టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు అనేక సంక్షేమ పథకాలు నిర్వహిస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం తలపెట్టిన నూతన సచివాలయ నిర్మాణంపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. సెక్షన్8 పై ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపిలకు కనీస జ్ఞానం లేదని ఆయన దుయ్యబట్టారు. సిఎం కెసిఆర్ చెప్పినవి చేసి చూపిస్తారని చెప్పారు. కాళేశ్వరం నిర్మిస్తామని చెప్పి నిర్మించి చూపించారన్నారు.

నూతన సచివాలయం తెలంగాణకు షాన్‌లా అద్భుతంగా నిర్మిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అమలు అవుతుందన్నారు. ప్రజాదరణలేని ప్రతిపక్షాలను పట్టించుకోవల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ భగీరథను బెంగాల్‌లో మమత బెనర్జీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ సభ్యుడు రాములు మాట్లాడుతూ ప్రజలు ప్రతిపక్షాలను తిరస్కరించారని చెప్పారు. ఎన్ని సంవత్సరాలైనా రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి అధికారంలోకి రావని ఆయన అన్నారు.

సెక్షన్ 8 ప్రసక్తే ఉత్పన్నం కాదు : మంత్రి హరీష్‌రావు
ఉత్తమ్‌కుమార్‌కు ఇంకా ఆంధ్ర మనస్తత్వం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల దగ్గర ఉత్తమ్ పనిచేయడంతో ఇంకా ఆ మనస్తత్వంలోనే ఉన్నారని ట్విట్టర్ వేదికగా హరీష్‌రావు నిందించారు. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన ఆరేళ్ల అనంతరం కూడా హైదరాబాద్‌పై ఆంధ్రప్రదేశ్ పెత్తనం ఉండాలని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కోరుకుంటున్నారని మంత్రి హరీష్‌రావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛందంగా, అధికారికంగా హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌తో పాటు అన్ని ప్రభుత్వ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత సెక్షన్ 8 ఉత్పన్నం కాదని హరీష్‌రావు స్పష్టం చేశారు. అయితే ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆంధ్ర మనస్తత్వం ఉండటంతో తెలంగాణ కోసం ఆలోచించడంలేదని ఆయన విమర్శించారు.

Jagadish, Talasani Fires on Opposition Parties

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post విపక్షాలది మూర్ఖత్వం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: