మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం

  బీజింగ్ : చైనా సంస్థ సినోవాక్ కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ పై ఫేజ్3 దశ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు సినోవాక్ తాజాగా వెల్లడించింది. ఫేజ్ 1, ఫేజ్ 2 దశలను విజయవంతంగా పూర్తి చేసుకొని మానవులపై జరుపుతున్న పరీక్షలకు సంబంధించి చివరి దశను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. బ్రెజిల్ వ్యాక్సిన్ తయారీదారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బుటాంటన్‌తో కలిసి చేయబోయే ఈ అధ్యయనంలో, కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రులలో పనిచేస్తున్న దాదాపు 9,000 మంది ఆరోగ్య […] The post మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బీజింగ్ : చైనా సంస్థ సినోవాక్ కీలక ప్రకటన చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ పై ఫేజ్3 దశ ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు సినోవాక్ తాజాగా వెల్లడించింది. ఫేజ్ 1, ఫేజ్ 2 దశలను విజయవంతంగా పూర్తి చేసుకొని మానవులపై జరుపుతున్న పరీక్షలకు సంబంధించి చివరి దశను త్వరలోనే ప్రారంభించబోతున్నట్టు తెలిపింది. బ్రెజిల్ వ్యాక్సిన్ తయారీదారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బుటాంటన్‌తో కలిసి చేయబోయే ఈ అధ్యయనంలో, కోవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రులలో పనిచేస్తున్న దాదాపు 9,000 మంది ఆరోగ్య నిపుణులను నియమించు కుంటామని వెల్లడించింది. బ్రెజిల్ లో నిర్వహించే ట్రయల్స్ కు వాలంటీర్ల ఎంపిక ఈ నెలలోనే ఉంటుందని వెల్లడించింది.

ఈ ట్రయల్స్ కు సంబంధించి గత వారమే చైనా కంపెనీకి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి చివరిలో టీకా తయారీ పనులను సినోవాక్ ప్రారంభించింది. సంవత్సరానికి 100 మిలియన్ డోస్ల ఉత్పత్తి సామర్ధ్యంతో కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ ప్లాంట్‌ను సిద్ధం చేస్తోంది. ఇది ఈ సంవత్సరం చివరి నాటికి సిద్ధంగా ఉంటుందని, సినోవాక్ భావిస్తోంది. వాక్సిన్ తయారీలో చివరి దశకు చేరుకున్నమూడు కంపెనీలలో ఒకటిగా సినోవాక్ నిలిచింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెన్కా సంయుక్తంగా తీసుకొస్తున్న వాక్సిన్ ప్రస్తుతం ఫేజ్ 3 లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు సినోఫాం (చైనా నేషనల్ ఫార్మాస్యూటికల్ గ్రూప్) కు చెందిన వ్యాక్సిన్ కూడా ఫేజ్ 3 పరీక్షల దశలో ఉంది.

China Sinovac is preparing phase 3 trials in China

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.