పాలనను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం : వినోద్

హైదరాబాద్ : పాలనను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలను తమ ప్రభుత్వం చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అవసరాల కోసమే కొత్త నిర్మాణాలను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఎంఎల్ఎల కోసం ప్రతి నియోజకవర్గంలో నివాసంతో పాటు క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో సచివాలయాన్ని అస్తవ్యస్తంగా నిర్మించారని […] The post పాలనను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం : వినోద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : పాలనను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చెప్పారు. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు, కొత్త కలెక్టరేట్ల నిర్మాణాలను తమ ప్రభుత్వం చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అవసరాల కోసమే కొత్త నిర్మాణాలను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఎంఎల్ఎల కోసం ప్రతి నియోజకవర్గంలో నివాసంతో పాటు క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో సచివాలయాన్ని అస్తవ్యస్తంగా నిర్మించారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో సచివాలయం ప్రజల అవసరాలను తీర్చలేదని ఆయన తెలిపారు. కొత్త సచివాలయం నిర్మించిన అనంతరం ఒకే చోట సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తేల్చి చెప్పారు. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని శ్రీకారం చుట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సచివాలయం వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని, కాళేశ్వరం ప్రాజెక్టు విపక్షాలకు ఎటువంటి సమాధానం చెప్పిందో, కొత్త సచివాలయం కూడా అదే సమాధానం చెబుతుందని ఆయన పేర్కొన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ రైతులు అనేక కష్టాలు పడ్డారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ రైతుల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని, దీంతో వారు సంతోషంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పాలనను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం : వినోద్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: