మహేశ్ బాబు కోసం బరువు పెరుగుతున్న కీర్తి సురేశ్

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ’ సర్కారు వారి పాట‘ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను అతలాకుతలం చేసిన భారీ కుంభకోణాలను ఇతివృత్తంగా […] The post మహేశ్ బాబు కోసం బరువు పెరుగుతున్న కీర్తి సురేశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ’ సర్కారు వారి పాట‘ అనే టైటిల్ నిర్ణయించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జి ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను అతలాకుతలం చేసిన భారీ కుంభకోణాలను ఇతివృత్తంగా చేసుకుని పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు బ్యాంక్ ఉద్యోగి కొడుకుగా నటిస్తున్నారట. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన ఓ వ్యాపారి నుంచి మహేశ్ ఆ మొత్తాన్ని ఎలా రాబట్టాడన్న అంశం సినిమాలో కీలకంగా ఉండనుందని సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రోమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుందని, ఈ సినిమాలో ముందుగా కియారా అద్వానీని తీసుకోవాలని భావించినప్పటికీ, ఆమె బాలీవుడ్ లో బిజీగా ఉండడంతో నటి కీర్తి సురేశ్ ను తీసుకున్నారని టాలీవుడ్ వర్గాలు సమాచారం మేరకు తెలుస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ బ్యాంక్ ఉద్యోగి పాత్రలో నటించనుందని సమాచారం. ఇటీవల సన్నబడిన కీర్తి, ఈ సినిమా కోసం కాసింత బరువు పెరుగుతుందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post మహేశ్ బాబు కోసం బరువు పెరుగుతున్న కీర్తి సురేశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: