క్వారంటైన్ కేంద్రంలో వృద్ధుడి ఆత్మహత్య

ముంబయి : కరోనా సోకిన ఓ వృద్ధుడు తాను చికిత్స పొందుతున్న క్వారంటైన్ కేంద్రంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పుణేలో సోమవారం రాత్రి జరిగింది. పుణేకు చెందిన ఓ వృద్ధుడు, అతడి కొడుకుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని కొంధ్వలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సదరు వృద్ధుడు సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వృద్ధుడి ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ […] The post క్వారంటైన్ కేంద్రంలో వృద్ధుడి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబయి : కరోనా సోకిన ఓ వృద్ధుడు తాను చికిత్స పొందుతున్న క్వారంటైన్ కేంద్రంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పుణేలో సోమవారం రాత్రి జరిగింది. పుణేకు చెందిన ఓ వృద్ధుడు, అతడి కొడుకుకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారిని కొంధ్వలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సదరు వృద్ధుడు సోమవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వృద్ధుడి ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పుణేపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇప్పటి వరకు పుణేలో 30 వేల మంది కరోనా బారిన పడ్డారు. 890 మంది కరోనాతో చనిపోయారు. దీంతో పుణే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజల సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని అధికారులు చెబుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని వారు స్పష్టం చేస్తున్నారు.

 

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post క్వారంటైన్ కేంద్రంలో వృద్ధుడి ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: