అనంతపురంలో దారుణం.. యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారం..

అమరావతిః ప్రజలకు రక్షణగా ఉండాల్సి పోలీసే రాక్షసుడిగా మారాడు. బెదిరరించి ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలోని బోయకొట్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు తన స్నేహితునితో మాట్లాడుతుండగా అక్కడికి వెళ్లిన ఏఆర్ కానిస్టేబుల్ యువతిని బెదిరించి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని అనంతపుంరం తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో నిర్బంధించి యువతిపై అత్యాచారం చేశాడు. తర్వాత మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఏఆర్ కానిస్టేబుల్ యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. బాధితురాలు అక్కడి నుంచి […] The post అనంతపురంలో దారుణం.. యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతిః ప్రజలకు రక్షణగా ఉండాల్సి పోలీసే రాక్షసుడిగా మారాడు. బెదిరరించి ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలోని బోయకొట్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు తన స్నేహితునితో మాట్లాడుతుండగా అక్కడికి వెళ్లిన ఏఆర్ కానిస్టేబుల్ యువతిని బెదిరించి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని అనంతపుంరం తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో నిర్బంధించి యువతిపై అత్యాచారం చేశాడు. తర్వాత మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఏఆర్ కానిస్టేబుల్ యువతిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏఆర్ కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు.

AR Constable Arrested for raping woman in Anantapur

The post అనంతపురంలో దారుణం.. యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారం.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: