అప్సర అందాలు అదరహో..

లాక్‌డౌన్‌లో సినీ పరిశ్రమలన్నీ స్తంభిస్తే రాంగోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. లాక్‌డౌన్‌లో కరోనావైరస్, క్లైమాక్స్, నేక్‌డ్ లాంటి చిత్రాలను రూపొందించి రిలీజ్ చేసి భారీ లాభాలను సొంతం చేసుకొంటున్నాడు. జీఎస్టీతో మియా మాల్కోవాను, నేక్‌డ్ చిత్రంలో క్యాస్టూమ్ డిజైనర్ శ్రీ రాపాకను తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ.. తాజాగా అప్సర రాణి అనే యువతిని పరిచయం చేస్తూ ట్వీట్లు చేశాడు. తాజాగా ‘థ్రిల్లర్’ అనే సినిమాను రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. […] The post అప్సర అందాలు అదరహో.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లాక్‌డౌన్‌లో సినీ పరిశ్రమలన్నీ స్తంభిస్తే రాంగోపాల్ వర్మ మాత్రం వరుస సినిమాలతో అదరగొడుతున్నారు. లాక్‌డౌన్‌లో కరోనావైరస్, క్లైమాక్స్, నేక్‌డ్ లాంటి చిత్రాలను రూపొందించి రిలీజ్ చేసి భారీ లాభాలను సొంతం చేసుకొంటున్నాడు. జీఎస్టీతో మియా మాల్కోవాను, నేక్‌డ్ చిత్రంలో క్యాస్టూమ్ డిజైనర్ శ్రీ రాపాకను తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ.. తాజాగా అప్సర రాణి అనే యువతిని పరిచయం చేస్తూ ట్వీట్లు చేశాడు.

తాజాగా ‘థ్రిల్లర్’ అనే సినిమాను రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా ఒడిశాకు చెందిన అప్సర రాణి అనే యువతిని పరిచయం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఆమె అందాన్ని వర్ణిస్తూ ప్రశంసలు గుప్పించాడు. అంతేకాకుండా ఆమె ఫోటోలను ట్వీట్ చేస్తూ ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న అప్సర రాణి మంచి నటి కంటే అద్భుతమైన డ్యాన్సర్ అని వర్మ పేర్కొన్నాడు. ఇక ఈ భామ ఇప్పటికే తెలుగులో రెండు, మూడు సినిమాల్లో నటించింది. ఉల్లాల ఉల్లాల, 4 లెటర్స్ చిత్రాల్లో ఆమె అంకిత మహారాణా పేరుతో హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ చిత్రాల వల్ల అంతగా గుర్తింపు రాకపోవడంతో తాజాగా అప్సరగా పేరు మార్చుకొని వర్మతో తన జాతకాన్ని పరీక్షించుకుంటోంది ఈ యంగ్ బ్యూటీ.

Apsara Rani play lead role in RGV’s ‘Thriller’ movie

 

The post అప్సర అందాలు అదరహో.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: