25 వేలు దాటినయ్

  రాష్ట్రంలో మరో 1831 కేసులు, 11 మంది మృతి ఎర్రగడ్డ రైతుబజార్‌లో కొవిడ్ సోకి కాంట్రాక్టర్ మృతి మూడు రోజుల పాటు మార్కెట్ మూసివేత రెండు రోజుల్లో నిమ్స్‌లో టీకా క్లినికల్ ట్రయల్స్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకీ అంతకంత రెట్టింపు స్థాయిలో విరుచుకుపడుతుంది. కొత్తగా మ రో 1831 కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. దీనిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 1419, జిల్లాల్లో […] The post 25 వేలు దాటినయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రాష్ట్రంలో మరో 1831 కేసులు, 11 మంది మృతి

ఎర్రగడ్డ రైతుబజార్‌లో కొవిడ్ సోకి కాంట్రాక్టర్ మృతి
మూడు రోజుల పాటు మార్కెట్ మూసివేత
రెండు రోజుల్లో నిమ్స్‌లో టీకా క్లినికల్ ట్రయల్స్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకీ అంతకంత రెట్టింపు స్థాయిలో విరుచుకుపడుతుంది. కొత్తగా మ రో 1831 కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. దీనిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 1419, జిల్లాల్లో 412 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఒకే రోజు 6 383 మందికి టెస్టులు చేయగా, 1831 మందికి పాజిటివ్ వచ్చిందని, వైరస్ దాడిలో మరో పదకొండు మంది చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 1419, రంగారెడ్డి 160, మేడ్చల్ 117, సంగారెడ్డి 3, కరీంనగర్ 5, మహబూబ్‌నగర్ 9, గద్వాల 1, నల్గొండ 1, వరంగల్ అర్బన్ 9, నిజామాబాద్ 9, వికారాబాద్ 7, మెదక్ 20, నారాయణపేట్ 1,పెద్దపల్లి 9, యాదాద్రి 1, సూర్యాపేట్ 6, మంచిర్యాల 20, ఖమ్మం 21, జగిత్యాల 4, మహబూబాబాద్‌లో ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 25733కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 14781కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 10646మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 306కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు. మరో రెండు రోజుల్లో నిమ్స్‌లో వ్యాక్సిన్ క్లినికల్స్… భారత్ బయోటెక్ ఫార్మ సంస్థ కనుగొన్న వ్యాక్సిన్‌ను నిమ్స్ ఆసుపత్రిలో మరో రెండు రోజుల్లో క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. వాస్తవంగా నేటి(జూలై 7) నుంచి జరగాల్సిన ఈ ట్రయల్స్ టెక్నీకల్ సమస్యల వలన మరో రెండు రోజుల తర్వాత ప్రారంభం అవుతుందని సమాచారం. అయితే ఇప్పటికై దాదాపు 85 శాతం సౌకర్యాలను అన్ని అందుబాటులో ఉంచామని నిమ్స్ అధికారులు ప్రకటించారు.

ఎర్రగడ్డ రైతుబజార్‌లో కాంట్రాక్టర్ మృతి…
ఎర్రగడ్డ రైతుబజార్‌లో కరోనా కలకలం సృష్టించింది. కోవిడ్ సోకి ఓ కాంట్రాక్టర్ చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో మూడు రోజుల పాటు రైతుబజార్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆయనను నేరుగా కలసిన వ్యక్తులను హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు.

గాంధీ ఆసుపత్రిలో వైద్యం బాగుంది…
కరోనా సోకిన రోగులందరికీ గాంధీ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందని విజయలక్ష్మి అనే 94 ఏళ్ల వృద్ధురాలు ఓ వీడియోలో తెలిపారు. సమయానికి వైద్యులు, నర్సులు వచ్చి తమ ఆరోగ్య పరిస్థితిపై అన్ని వివరాలను అడిగి తెలుసుకొని వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆహారం కూడా అద్బుతంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి వైద్యం లభిస్తుందని ఊహించలేదని ఆమె తెలిపారు.

ఈటల నాకు దేవుడితో సమానం

తాను నిర్వర్తించే పనిపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి నిబద్ధతను చాటుకున్నారు. కరోనా కట్డడిపై నిద్రలేని రాత్రులు గడుపుతూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. మానవత్వంతో కనికరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న కరోనా రోగిని కాపాడారు. దీంతో మంత్రి ఈటల తనకు దేవుడితో సమానమని ఆ బాధితుడు కన్నీటిపర్యంతమైనారు. దీనిపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ రఫీ అనే యువకుడికి కోవిడ్ సోకడంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. దీంతో సిటీలో ఉన్న అనేక ఆసుపత్రులు తిరిగాడు. కానీ ఆ యువకుడిని ఎక్కడా చేర్చుకోలేదు.

అయితే ఇంటర్నెట్‌లో మంత్రి నంబర్ చూసి ఫోన్ చేయగా, నిమిషాల్లోనే మెరుగైన వైద్యం అందిందని ఆయన వీడియోలో తెలిపారు. అర్థరాత్రి 12 గంటలకు తాను మంత్రి ఈటలకు ఫోన్ చేయగా, తమ గురించి పి.ఎకి చెప్పారని, ఆ తర్వాత ఆయన వెంటనే మా వివరాలు తీసుకొని తాము ఉన్న ప్రాంతానికి అంబులెన్స్‌ను పంపించి ఆసుపత్రిలో అడ్మిట్ చేశారని తెలిపారు. అయితే అర్థరాత్రి ఫోన్ చేసినా స్పందించిన ఈటల, అతని పిఎకు కృతజ్ఞతులై ఉంటానని ఆయన ఆసుపత్రి బెడ్‌పై నుంచి మాట్లాడారు. రాత్రనక, పగలనక శ్రమిస్తున్న మంత్రికి అభినందనలు తెలిపారు. కరోనా విపత్కర సమయంలో 24 గంటల పాటు పనిచేస్తున్న మంత్రికి ఆయువకుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరస్ కావడంతో మంత్రిని ప్రజలంతా అభినందిస్తున్నారు.

11 deaths 1 831 new Covid-19 cases in Telangana

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post 25 వేలు దాటినయ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: