కోటి దాటిన కొవిడ్ టెస్టులు

  రోజూ 3 లక్షల శాంపిల్స్ పరీక్షించే స్థాయికి చేరాం ఐసిఎంఆర్ వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచడం అనివార్యమైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) దేశంలో గత కొంత కాలంగా ప్రతినిత్యం దాదాపు రెండున్నర లక్షల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షిస్తోంది. సోమవారం ఉదయం 11 గంటల వరకు దేశంలో కోటీ 4 వేల 101శాంపిళ్లకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు […] The post కోటి దాటిన కొవిడ్ టెస్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రోజూ 3 లక్షల శాంపిల్స్ పరీక్షించే స్థాయికి చేరాం
ఐసిఎంఆర్ వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచడం అనివార్యమైన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా భారత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) దేశంలో గత కొంత కాలంగా ప్రతినిత్యం దాదాపు రెండున్నర లక్షల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షిస్తోంది. సోమవారం ఉదయం 11 గంటల వరకు దేశంలో కోటీ 4 వేల 101శాంపిళ్లకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ మీడియా కోఆర్డినేటర్ డాక్టర్ లోకేశ్ శర్మ తెలిపారు. ఆదివారం నాడు 1,80,596 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆయన చెప్పారు. దేశంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ఐసిఎంఆర్ 1,105 ల్యాబ్స్‌కు అనుమతి ఇచ్చింది.

వీటిలో 788 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉండగా,317 ల్యాబ్‌లు ప్రైవేటు రంగంలో ఉన్నాయి. కొవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం దేశంలో ఆర్‌టిపిసిఆర్, ట్రూనాట్,సిబినాట్ విధానాలను అనుసరిస్తున్నారు. దీనికోసం స్వాబ్ ద్వారా(ముక్కు, గొంతునుంచి) శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు. గత 14 రోజులుగా దేశంలో సగటున దాదాపు 2 లక్షల శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారని లోకేశ్ శర్మ చెప్పారు. మే 25 నాటికి దేశంలో కేవలం దాదాపు లక్షన్నర శాంపిల్స్‌ను పరీ సామర్థం మాత్రమే ఉండగా ఇప్పడది రోజుకు 3 లక్షల శాంపిల్స్‌ను పరీక్షించే స్థాయికి పెరిగిందని ఆయన తెలిపారు.

Coronavirus tests in India cross one crore mark/

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కోటి దాటిన కొవిడ్ టెస్టులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: