రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.1.61 లక్షల కోట్లు

  హైదరాబాద్ : ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక రూ. 1,61,120 కోట్లుగా నిర్ధేశించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.75,141 కోట్లుగా కాగా పంట రుణాల లక్ష్యం రూ.53,222 కోట్లుగా ఉంది. వానాకాలంలో 60 శాతం, యాసంగి సీజన్ 40 శాతం కలిపి రైతులకు వీటిని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ […] The post రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.1.61 లక్షల కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్ : ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళిక రూ. 1,61,120 కోట్లుగా నిర్ధేశించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.75,141 కోట్లుగా కాగా పంట రుణాల లక్ష్యం రూ.53,222 కోట్లుగా ఉంది. వానాకాలంలో 60 శాతం, యాసంగి సీజన్ 40 శాతం కలిపి రైతులకు వీటిని పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. రుణ ప్రణాళిక ప్రకారం గతేడాది కంటే ఈసారి మొత్తం రుణాలు 10.52 శాతం పెరిగాయి.

ఇక పంట రుణాల విషయానికొస్తే గత ఆర్థిక సంవత్సరంలో రూ.48,740 కోట్లుగా ఉంది. ఈసారి రూ.53,222 కోట్లుగా నిర్దేశించుకున్నారు. అంటే 9.20 శాతం పెరిగింది. వ్యవసాయ, అనుబంధ రంగాలకు ఇవ్వాల్సిన దీర్ఘకాలిక రుణాలు రూ.12,061 కోట్లు చూపారు. గడిచిన ఆర్థిక సంవత్సరం కంటే 5.38 శాతం పెంచారు. వ్యవసాయ రంగంలో మౌళిక సదుపాయల కల్పన కోసం రూ.2422 కోట్లు కేటాయించారు. గతం కంటే 16.02 శాతం పెంచారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.7435 కోట్లు ఉంది.

రుణ ప్రణాళికలో గతేడాదితో చూస్తే మొత్తంగా వ్యవసాయ రంగానికి 9.54 శాతం రుణాలు పెంచారు. ప్రధానంగా పంటల ఉత్పత్తి, మార్కెటింగ్, వ్యవసాయ సంబంధ మౌళిక సదుపాయల కల్పన, నీటి వనరులు, ఉద్యాన, పట్టు పరిశ్రమలు, అటవీ సంపద, పనికిరాని భూములను అభివృద్ధితో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించి (ఎంఎస్‌ఎంఇ) రూ. 35,196 కోట్లు రుణాల పంపిణీ లక్షంగా ఉంది. విద్యా రుణాలు రూ.2165.73 కోట్లు, గృహ సంబంధిత రుణాలు రూ. 8048 కోట్లు, ఇతర ప్రాధాన్య రంగాలు రూ. 2,167 కోట్లు పంపిణీ చేయాలని ప్రణాళికలో లక్షంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించుకున్న పంట రుణాల్లో 76.13 శాతమే పంపిణీ చేశారు.

ఆత్మ నిర్భర్ కింద రుణాలు
కరోనా నేపథ్యంలో ఆత్మ నిర్భర్ భారత్ అభయాన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని రంగాలకు ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేసినట్లు ఎస్‌ఎల్‌బిసి తన నివేదికలో వెల్లడించింది. ఎంఎస్‌ఎంఇలకు రూ.2513 కోట్లు మంజూరు కాగా ఇప్పటికే రూ.1688 కోట్లు అత్యవసర రుణ కింద అర్హులకు ఇచ్చారు. అదే సమయంలో రూ.231 కోట్లు అర్హులైన రైతులకు ఇచ్చినట్లు తెలిపారు.

68,190 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.370 కోట్లు అదనంగా ఇవ్వనున్నట్లు పేర్కొంది. అదే విధంగా స్ట్రీట్ వెండర్స్ కూడా నిధులు ప్రత్యేక రుణం ఇస్తున్నట్లు ఎస్‌ఎల్‌బిసి వెల్లడించింది. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రాస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఎస్‌ఎల్‌బిసి అధ్యక్షులు ఎస్‌బిఐ సిజిఎం ఓం ప్రకాశ్ మిశ్రా, ఆర్‌బిఐ జనరల్ మేనేజర్ శంకర్ సుందరం, నాబార్డు సిజిఎం కృష్ణారావు ఇతర బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

2020-21 వ్యవసాయ రుణ ప్రణాళిక లక్ష్యం (రూ. కోట్లలో)

షార్ట్ టర్మ్ పంట రుణాలు                               రూ. 53,222 కోట్లు
వ్యవసాయ, అనుబంధ పెట్టుబడి రుణాలు              రూ.12,061 కోట్లు
వ్యవసాయ అనుబంధ కార్యాకలపాలకు                 రూ. 7435 కోట్లు
మౌళిక సదుపాయాలు                                  రూ. 2422 కోట్లు
మొత్తం                                        రూ. 75,141 కోట్లు

State spending Rs 75 cr on agriculture sector

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.1.61 లక్షల కోట్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: