కశ్మీరు మాజీ డిఎస్‌పి దావీందర్ సింగ్‌పై ఎన్‌ఐఎ చార్జిషీట్

  న్యూఢిల్లీ: కశ్మీరు లోయలో ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన జమ్మూ కశ్మీరు పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ దావీందర్ సింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) చార్జిషీట్ దాఖలు చేసింది. కశ్మీరు ఉగ్రవాదులు నవీద్ బాబు, రఫీ అహ్మద్ రాథెర్, ఇర్ఫాన్ షఫీ మీర్‌లు పారిపోయేందుకు తోడ్పడ్డారన్న ఆరోపణలపై ఈ ఏడాది జనవరిలో దావీందర్ సింగ్ అరెస్టు అయ్యారు. కాగా, కుట్ర కోణానికి సంబంధించిన మరో కేనులో నిర్ణీత గడువు 90 రోజుల్లో చార్జిషీట్ […] The post కశ్మీరు మాజీ డిఎస్‌పి దావీందర్ సింగ్‌పై ఎన్‌ఐఎ చార్జిషీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: కశ్మీరు లోయలో ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురైన జమ్మూ కశ్మీరు పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ దావీందర్ సింగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) చార్జిషీట్ దాఖలు చేసింది. కశ్మీరు ఉగ్రవాదులు నవీద్ బాబు, రఫీ అహ్మద్ రాథెర్, ఇర్ఫాన్ షఫీ మీర్‌లు పారిపోయేందుకు తోడ్పడ్డారన్న ఆరోపణలపై ఈ ఏడాది జనవరిలో దావీందర్ సింగ్ అరెస్టు అయ్యారు. కాగా, కుట్ర కోణానికి సంబంధించిన మరో కేనులో నిర్ణీత గడువు 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలం చెందడంతో దావీందర్ సింగ్‌కు ఢిల్లీకి చెందిన స్థానిక కోర్టు ఈ నెల మొదట్లో బెయిల్ మంజూరు చేసింది.

దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నేరపూరిత కుట్రకు, కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసుకు చెందిన ప్రత్యేక విభాగం(ఉగ్రవాద నిరోధక విభాగం) దావీందర్ సింగ్‌పై గతంలో కేసు నమోదు చేసింది. ఈ ఏడాది జనవరిలో శ్రీనగర్-జమ్మూ హైవేలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులను వాహనంలో సురక్షితంగా పంపించారన్న ఆరోపణల కేసులో అరెస్టు అయిన దావీందర్ సింగ్ బెయిల్ మంజూరు అయినప్పటికీ జైలు నుంచి విడుదల కాలేదు.

NIA chargesheet against J&K DSP Davinder Singh

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post కశ్మీరు మాజీ డిఎస్‌పి దావీందర్ సింగ్‌పై ఎన్‌ఐఎ చార్జిషీట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: