నేపాల్ ప్రధాని భవితవ్యం తేలేది రేపు

  న్యూఢిల్లీ: భారత వ్యతిరేక ప్రకటనలు, తన ఏకపక్ష వైఖరి కారణంగా దేశీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి రాజకీయ భవితవ్యంపై నిర్ణయం బుధవారానికి వాయిదా పడింది. ఓలి రాజీనామా చేయాలన్న డిమాండ్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో చైనా రాయబారి నేపాల్‌కు చెందిన సీనియర్ నాయకుడిని కలుసుకున్న దరిమిలా ప్రధాని ఓలి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడానికి జరగవలసిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సిపి) కీలక సమావేశం మూడవసారి బుధవారానికి వాయిదా పడింది. […] The post నేపాల్ ప్రధాని భవితవ్యం తేలేది రేపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: భారత వ్యతిరేక ప్రకటనలు, తన ఏకపక్ష వైఖరి కారణంగా దేశీయంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి రాజకీయ భవితవ్యంపై నిర్ణయం బుధవారానికి వాయిదా పడింది. ఓలి రాజీనామా చేయాలన్న డిమాండ్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో చైనా రాయబారి నేపాల్‌కు చెందిన సీనియర్ నాయకుడిని కలుసుకున్న దరిమిలా ప్రధాని ఓలి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడానికి జరగవలసిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సిపి) కీలక సమావేశం మూడవసారి బుధవారానికి వాయిదా పడింది.

నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి చెందిన 45 మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశం ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం జరగవలసి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడింది. నేటి సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేసినట్లు నేపాల్ ప్రధాని మీడియా సలహాదారు సూర్య తాపా తెలిపారు. చైనా రాయబారి హో యాంకీ ఆదివారం నేపాల్ కమ్మూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని మాధవ్ కుమార్‌ను ఆదివారం కలుసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

ఎన్‌సిపిలోని ప్రధాని ఓలి, పార్టీ ఎగ్జిక్యుటివ్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ’ కు చెందిన రెండు వర్గాల మధ్య పోరు ఇటీవల తీవ్రతరం దాల్చింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశౠలను నిరవధికంగా వాయిదా వేస్తూ గత గురువారం ప్రధాని ఓలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో ఈ రెండు వర్గాల మధ అధికార పంపకంపై సాగుతున్న అంతర్గత పోరు మరింత ఉధృతమైంది. సీనియర్ నాయకులు, మాజీ ప్రధానమంత్రులు మాధవ్ నేపాల్, ఝలనాథ్ ఖనల్ మద్దతుతో ప్రచండ వర్గం ప్రధాని ఓలి రాజీనామాకు పట్టుబడుతోంది.

ఇలా ఉండగా, చైనా రాయబారి హో ఆదివారం సాయంత్రం మాధవ్ నేపాల్‌ను కోటేశ్వర్‌లోని ఆయన నివాసంలో కలుసుకుని తాజా పరిస్థితులపై చర్చించినట్లు ఎన్‌సిపి సీనియర్ నాయకుడు ఒకరు వెల్లడించారు. అంతేగాక నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారిని కూడా చైనా రాయబారి అదివారం కలుసుకున్నట్లు రిపబ్లికా వార్తాపత్రిక సోమవారం ప్రచురించింది. సంక్షోభ సమయాలలో నేపాల్ ఆంతరంగిక వ్యవహారాలలో చైనా రాయబారి జోక్యం చేసుకోవడం ఇది మొదటిసారి కాదు. నెలన్నర క్రితం ఎన్‌సిపి అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకున్న తరుణంలో చైనా రాయబారి హో నేపాల్ అధ్యక్షురాలు భండారిని, ప్రధాని ఓలి, ఇతర సీనియర్ నాయకులు ప్రచండ, మాధవ్ తదితరులను వేర్వేరుగా కలుసుకుని చర్చలు జరిపారు.

PM Oli future incertain as NCP meeting postponed

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post నేపాల్ ప్రధాని భవితవ్యం తేలేది రేపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: