ఆల్మట్టి ఎత్తు పెంచలేరు

  సుప్రీం కోర్టులో స్టే ఉంది తెలంగాణ వాదనలు విన్న అనంతరమే స్టే వెకేట్ అవుతుంది స్టే ఎత్తివేస్తే కేంద్రం గెజిట్‌లో ప్రచురించాలి కర్నాటక రాష్ట్ర నీటిపారుదల మంత్రి ప్రకటనను ఆక్షేపించిన రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్: అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కర్ణాటక సాగునీటి పారుదల శాఖ చేసిన ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం తప్పు బట్టింది. సుప్రీంకోర్టులో స్టేఉండగా ప్రాజెక్టు ఎత్తు పెంచే అధికారం కర్ణాటక ప్రభుత్వానికి లేదని తెలంగాణ సాగునీటిపారుదల […] The post ఆల్మట్టి ఎత్తు పెంచలేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సుప్రీం కోర్టులో స్టే ఉంది
తెలంగాణ వాదనలు విన్న అనంతరమే స్టే వెకేట్ అవుతుంది
స్టే ఎత్తివేస్తే కేంద్రం గెజిట్‌లో ప్రచురించాలి
కర్నాటక రాష్ట్ర నీటిపారుదల మంత్రి ప్రకటనను ఆక్షేపించిన రాష్ట్ర ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్: అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని కర్ణాటక సాగునీటి పారుదల శాఖ చేసిన ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం తప్పు బట్టింది. సుప్రీంకోర్టులో స్టేఉండగా ప్రాజెక్టు ఎత్తు పెంచే అధికారం కర్ణాటక ప్రభుత్వానికి లేదని తెలంగాణ సాగునీటిపారుదల శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎత్తు పెంచేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి రమేష్ జకోలి చేసిన ప్రకటనను తెలంగాణ ప్రభుత్వం ఆక్షేపించింది. 519 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాజెక్టును 524 అడుగుల ఎత్తుకు పెంచాలని కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదించగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బచావత్ ట్రి బ్యునల్ అవార్డు ఇచ్చింది.

అయితే ఆ తర్వాత బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ దీనిని పునరుద్ధరించగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అల్మట్టి ఎత్తు పెంచే అంశాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టుకు వెళ్లగా ఎత్తు పెంపుపై సుప్రీ కోర్టు స్టే విధించింది. సుప్రీంకోర్టు స్టే విధించినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం ఎత్తు పెంచే ఏ అంశంలోనైనా నిర్ణయం తీసుకుంటే కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు చెప్పారు. సుప్రీంకోర్టుకు తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ వెళ్లగా సుప్రీకోర్టు స్టే విధించిందని ఇంజనీర్లు తెలిపారు.

సుప్రీంకోర్టు తెలంగాణ వాదనలు విన్న అనంతరమే స్టే పై నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. ఒకవేళ స్టే తొలగించినా సుప్రీంకోర్టు తొలగించిన స్టేను కేంద్రం గెజిట్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. సున్నితమైన ఈ న్యాయవ్యవహారంలో ఉన్న అల్మట్టి ఎత్తు పెంచే అంశంపై కర్ణాటక ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తోందని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే ఈ అంశం ఇలా ఉంటే కర్ణాటక మంత్రి జకోలి ముప్పయి వేల కోట్ల రూపాయల వ్యయంతో 524 అడుగుల ఎత్తు పెంచనున్నట్లు చేసిన ప్రకటన వివాదస్పదమైంది.

అనుమతిచ్చే అధికారం కేంద్రానికిలేదు
సుపీంకోర్టులో స్టే ఉండగా అల్మట్టి ఎత్తుపెంచేందుకు అనుమతి ఇచ్చే అధికారాలు కేంద్రానికి లేవని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పారు. తెలంగాణ జల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచితే సహించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర వాదనలు విన్న అనంతరమే స్టేపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఏర్పడకముందు బచావత్ ఇచ్చిన అవార్డును బ్రిజేష్‌కుమార్ పునరుద్ధరించిందే కానీ తెలంగాణ వాదనలను వినలేదని ఆయన చెప్పారు. అల్మట్టి ఎత్తును పెంచితే కృష్ణానదీ జలాలపై మహబూబ్‌నగర్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందన్నారు.

CM ask Centre to stop increasing Almat dam height

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఆల్మట్టి ఎత్తు పెంచలేరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: