సర్కారీ భూముల పరిరక్షణకు ప్రత్యేక సెల్

  మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా టోల్ ఫ్రీ నంబర్ 18005990099 మన తెలంగాణ/సిటీ బ్యూరో: ప్రభుత్వ భూముల పరిరక్షణకు బల్దియా మరో విన్నూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని ప్రభుత్వ పార్కుల, చెరువులు, బహిరంగ స్థలాలు పరిరక్షణే ధ్యేయంగా జిహెచ్‌ఎంసిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆ ధ్వర్యంలో ఆస్తుల పరిరక్షణ విభాగం (అస్సెట్ ప్రొటెక్షన్ సెల్)ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా 180059900 99 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ […] The post సర్కారీ భూముల పరిరక్షణకు ప్రత్యేక సెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా టోల్ ఫ్రీ నంబర్ 18005990099

మన తెలంగాణ/సిటీ బ్యూరో: ప్రభుత్వ భూముల పరిరక్షణకు బల్దియా మరో విన్నూత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని ప్రభుత్వ పార్కుల, చెరువులు, బహిరంగ స్థలాలు పరిరక్షణే ధ్యేయంగా జిహెచ్‌ఎంసిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆ ధ్వర్యంలో ఆస్తుల పరిరక్షణ విభాగం (అస్సెట్ ప్రొటెక్షన్ సెల్)ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా 180059900 99 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ టెల్ ఫ్రీ నంబర్‌ను ఆదివారం ప్రగతి భవన్‌లో పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు తన చేతుల మీదగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ డి. ఎస్.లోకేష్ కుమార్, ఈవిడిఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటిలు పాల్గొన్నారు. అస్సెట్ ప్రొటెక్షన్ సెల్‌కు 6 నెలల క్రితమే రూపకల్పన గ్రేటర్ పరిధిలో జిహెచ్‌ఎంసి సంబంధించి సుమారు 3వేల వరకు అన్ని రకాల పార్కులు ఉన్నాయి. అయితే ఈ పార్కులో 1000 మేరకు వినియోగంలో ఉండగా మరో 2వేల వరకు నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో గతంలోనే వాటి చుట్టూ ప్రహరీ గోడలను నిర్మించారు. అదేవిధంగా ప్రభుత్వ భూములు సైతం పార్సిల్స్ రూపంలో చిన్న చిన్న బిట్లుగా నగర వ్యాప్తంగా ఉండగా, వందకు పైగా చెరువులు ఉన్నాయి.

రాష్ట్ర రాజధాని కేంద్రం కావడంతో ఇక్కడ గజం స్థలం వేల నుంచి లక్షల పలుకుతుండడంతో కొంతమంది ఆ స్థలాలను యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు. దీంతో గ్రేటర్ పరిధిలోని ప్రభుత్వ భూములతో పాటు పార్కులు, చెరువుల స్థలాల పరిరక్షణకు కోసం గత 6 నెలల క్రితమే ప్రత్యేక కార్యాచరణను జిహెచ్‌ఎంసి సిద్ధం చేసింది. అస్సెట్ ప్రొటెక్షన్ సెల్‌ను మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసినప్పటికీ కరోనా మహహ్మరి కొంత జ్యాపం కాగా, ఆదివారం ప్రారంభమైంది.

టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తేచాలు..
గ్రేటర్ పరిధిలో జిమెచ్‌ఎంసి ఇక మీదట గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, బహిరంగ స్థలాలు, పార్కులను ఎవరైనా కబ్జా చేసినా, ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించుకున్నా నగరవాసులు ఈ టోల్ ఫ్రీ నంబర్ 18005990099 ద్వారా జిహెచ్‌ఎంసికి సమాచారం అందిస్తే చాలు వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత ఎన్‌పోర్స్‌మెంట్ అధికారికి సమాచారం వెళుతుంది. ఆయన తనకు అందిన సమచారం, ఫిర్యాదుపై వెంట నే తక్షణమే చర్యలు ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి జోనల్, సర్కిల్స్ స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించారు.

ప్రతి ఫిర్యాదుకు విశిష్ట నంబర్ కేటాయింపు
చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాలు కబ్జాలకు గురైనట్లు పౌరుల నుంచి సమాచారం అందిన వెంటనే ఒక ప్రత్యేకమైన ఫిర్యాదు నమోదు అవుతుంది. అందిన ప్రతి సమాచారం కాని ఫిర్యాదుకు గాని ప్రత్యేకంగా ఒక విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఈ విశిష్ట సంఖ్య ద్వారా భవిష్యత్తులో తన ఫిర్యాదు పురోగతిని సమాచారం అందించిన వారు తెలుసుకోవచ్చు. అన్ని పని రోజుల్లో ఉ. 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ విభాగం పనిచేస్తోంది. సమాచారం అందించివారు తమ వివరాలను వెల్లడించవద్దని కోరితే పూర్తిగా గోప్యంగా ఉంచుతారు.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సర్కారీ భూముల పరిరక్షణకు ప్రత్యేక సెల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: