1590 కొత్త కేసులు

  ఏడుగురు మృతి, జిహెచ్‌ఎంసిలో 1277, జిల్లాల్లో 313 మందికి వైరస్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి ఆగడం లేదు. దీంతో అందరిలో వైరస్ టెన్షన్ పట్టుకుంది. ఒకే రోజు 5290 మందికి టెస్టుల చేయగా, 1590 మందికి పాజిటివ్ వచ్చిందని, వైరస్ దాడిలో మరో ఏడుగురు చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 1277, జిల్లాల్లో 313 మంది ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అయితే రోజురోజుకి కేసులు అంతకంతకి పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన […] The post 1590 కొత్త కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఏడుగురు మృతి, జిహెచ్‌ఎంసిలో 1277, జిల్లాల్లో 313 మందికి వైరస్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి ఆగడం లేదు. దీంతో అందరిలో వైరస్ టెన్షన్ పట్టుకుంది. ఒకే రోజు 5290 మందికి టెస్టుల చేయగా, 1590 మందికి పాజిటివ్ వచ్చిందని, వైరస్ దాడిలో మరో ఏడుగురు చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 1277, జిల్లాల్లో 313 మంది ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అయితే రోజురోజుకి కేసులు అంతకంతకి పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెం దుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 1277, రంగారెడ్డి 82, మేడ్చల్ 125, సంగారెడ్డి 19, కరీంనగర్ 4, మహబూబ్‌నగర్ 19, గద్వాల 1, రాజాన్న సిరిసిల్లా 1, నల్గొండ 14, సిద్ధిపేట్ 1,

వరంగల్ రూరల్ 1, నిర్మల్ 2, నిజామాబాద్ 3, వికారాబాద్ 2, మెదక్ 3, నారాయణపేట్ 1, భద్రాది కొత్తగూడెం 2, జనగాం 2, పెద్దపల్లి 1, యాదాద్రి 1, వనపర్తి 4, సూర్యాపేట్ 23, కామారెడ్డి 1, ఆదిలాబాద్‌లో ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23902కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 12703కి చేరింది. ప్రస్తుతం ప్రభుత్వం పర్యవేక్షణలో 10904మంది చికిత్స పొందుతుండగా, వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 295 కి పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

కరోనా అనుమానంతో యువకుడి ఆత్మహత్య.. హుస్సేన్‌సాగర్‌లో దూకిన బాధితుడు, లభించని ఆచూకీ
కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఓ వ్యక్తి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్‌కు చెందిన పల్టుపాన్(4) కొద్ది ఏళ్ల క్రితం భార్యతో వచ్చి దూద్‌బౌలిలో స్థిరపడ్డాడు. గోల్డ్‌స్మీత్‌గా పనిచేస్తున్న అతడు పదిరోజుల నుంచి జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు. దీంతో స్థానిక క్లీనిక్‌లో చికిత్స తీసుకున్నాడు. అయినా తగ్గకపోవడంతో వైద్యుల సూచన మేరకు మలక్‌పేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు.

రెండు రోజులు ఆస్పత్రి చుట్టూ తిరిగినా కూడా బెడ్లు లేవని చేర్చుకోలేదు. తనకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పినా వారు చేర్చుకోలేదు. శ్వాస తీసుకోవడంలో శుక్రవారం మరింత ఇబ్బంది కావడంతో భయాందోళనకు గురైన పల్టుపాన్ తన స్నేహితుడు శ్రీరాములకు ఫోన్ చేసి హుస్సేన్‌సాగర్ వద్దకు తీసుకెళ్లాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రాత్రి 7.55గంటలకు ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. శ్రీరాములను అక్కడే ఉంచి పల్టుపాన్ ముందుకు వెళ్లి హుస్సేన్ సాగర్‌లో దూకాడు. దీన్ని గమనించిన శ్రీరాములు రాంగోపాల్‌పేట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టినప్పటికి ఆచూకీ లభించలేదు.

Telangana records 1,590 COVID cases on Sunday

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post 1590 కొత్త కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: