హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డిపాజిట్లు 25% వృద్ధి

  న్యూఢిల్లీ: జూన్ 30 నాటికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొత్తం రుణాలు ఏడాది క్రితంతో పోలిస్తే 21 శాతం వృద్ధిని సాధించాయి. అదే సమయంలో ఇదే కాలంలో డిపాజిట్లు 25 శాతం పెరిగాయి. స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో, ప్రైవేట్‌రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2020 జూన్ 30నాటికి మొత్తం రుణం 10.04 లక్షల కోట్లకు పెరగ్గా, ఏడాది క్రితం ఇదే సమయంలో ఈ రుణాల మొత్తం రూ. 8.29 లక్షల కోట్లుగా ఉంది. మార్చి 31 నాటికి […] The post హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డిపాజిట్లు 25% వృద్ధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: జూన్ 30 నాటికి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మొత్తం రుణాలు ఏడాది క్రితంతో పోలిస్తే 21 శాతం వృద్ధిని సాధించాయి. అదే సమయంలో ఇదే కాలంలో డిపాజిట్లు 25 శాతం పెరిగాయి. స్టాక్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారంలో, ప్రైవేట్‌రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 2020 జూన్ 30నాటికి మొత్తం రుణం 10.04 లక్షల కోట్లకు పెరగ్గా, ఏడాది క్రితం ఇదే సమయంలో ఈ రుణాల మొత్తం రూ. 8.29 లక్షల కోట్లుగా ఉంది. మార్చి 31 నాటికి ఇది రూ.9.93 లక్షల కోట్లుగా ఉంది.

ఇక బ్యాంక్ డిపాజిట్ల విషయానికొస్తే, 2020 మార్చి 31నాటికి బ్యాంక్ రూ.11.47 లక్షల కోట్ల డిపాజిట్లను కలిగి ఉంది. 2020 జూన్ 30నాటికి బ్యాంక్ మొత్తం డిపాజిట్లు రూ.11.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇది 9,54,600 కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయి. జూన్ 30 నాటికి బ్యాంక్ కరెంట్ అకౌంట్ సేవింగ్స్ రేషియో 40 శాతం ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో 39.7 శాతంగా, మార్చి 31 నాటికి ఇది 42.2 శాతంగా ఉంది. శుక్రవారం బ్యాంకు షేర్లు బిఎస్‌ఇలో 1.42 శాతం తగ్గి రూ.1,074కు చేరుకుంది.

HDFC Bank deposits rise 25% YoY in Q1 FY21

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డిపాజిట్లు 25% వృద్ధి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: