రూ.1.37 లక్షల కోట్లు పెరిగింది

  గత వారం టాప్ 10 కంపెనీల మార్కెట్ విలువ ముంబై: గత వారం టాప్10 బ్లూచిప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రూ.1,37,508.61 కోట్లు పెరిగింది. వీటిలో  కంపెనీలు భారీగా లాభపడ్డాయి. గత వారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 850.15 పాయింట్లు లేదా 2.41 శాతం లాభపడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) మార్కెట్ విలువ రూ.31,294.89కోట్లు పెరిగి మొత్తం రూ.8,25,149కోట్లకు చేరింది. అదే సమయంలో ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,464.11కోట్లు పెరిగి రూ.11,33,168 కోట్లకు చేరిందని […] The post రూ.1.37 లక్షల కోట్లు పెరిగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

గత వారం టాప్ 10 కంపెనీల మార్కెట్ విలువ

ముంబై: గత వారం టాప్10 బ్లూచిప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) రూ.1,37,508.61 కోట్లు పెరిగింది. వీటిలో  కంపెనీలు భారీగా లాభపడ్డాయి. గత వారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 850.15 పాయింట్లు లేదా 2.41 శాతం లాభపడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) మార్కెట్ విలువ రూ.31,294.89కోట్లు పెరిగి మొత్తం రూ.8,25,149కోట్లకు చేరింది. అదే సమయంలో ఆర్‌ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,464.11కోట్లు పెరిగి రూ.11,33,168 కోట్లకు చేరిందని గణాంకాలు చెబుతన్నాయి.

హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ విలువ రూ.20,519 కోట్లు పెరిగి రూ.3,27,120 కోట్లకు చేరగా, మరో సంస్థ ఐటిసి మార్కెట్ విలువ రూ.15,057 కోట్లు పెరిగి రూ.2,54,879 కోట్లు అయింది. భారతి ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ 11,347.56 కోట్లు పెరిగి రూ.3,17,022 కోట్లు కాగా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ వాల్యుయేష రూ .10,211.92 కోట్లు పెరిగి రూ .5,89,765.72 కోట్లకు చేరుకుంది. ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.7,780కోట్లు పెరిగి రూ.2,33,782 కోట్లకు చేరింది.

ఇన్ఫోసిస్ మార్కె ట్ విలువ రూ.6,154 కోట్లు లాభపడి 3,24,803.13 కోట్లకు చేరింది. హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్(హెచ్‌యుఎల్) మార్కెట్ విలువ రూ.4,193 కోట్లు పెరిగి మొత్తం రూ.5,10,392 కోట్లకు చేరగా, మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ విలువ రూ.2,483.4 కోట్లు పెరి గి రూ.2,67,831 కోట్లు అయింది. సెన్సెక్స్ అత్యంత విలువైన కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. తరువాత టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌యుఎల్,హెచ్‌డిఎఫ్‌సి, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్‌టెల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయి.

Top 10 firms add Rs 1.37 lakh crore in market cap

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post రూ.1.37 లక్షల కోట్లు పెరిగింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: