టైటిల్ సాధించడమే లక్ష్యం : సెరెనా విలియమ్స్

  న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ స్పష్టం చేసింది. కరోనా మహమ్మరి కారణంగా ఇప్పటికే చాలా రోజుల పాటు టెన్నిస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని వాపోయింది. ఇకపై జరిగే అన్ని టోర్నీల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని వివరించింది. ఇక, చాలా కాలంగా ఆటకు దూరంగా ఉండడంతో పూర్వ వైభవం సాధించడం అనుకున్నంత తేలికకాదని అభిప్రాయపడింది. అయితే తాను మాత్రం కఠోర సాధనతో మళ్లీ గాడిలో […] The post టైటిల్ సాధించడమే లక్ష్యం : సెరెనా విలియమ్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్ స్పష్టం చేసింది. కరోనా మహమ్మరి కారణంగా ఇప్పటికే చాలా రోజుల పాటు టెన్నిస్‌కు దూరంగా ఉండాల్సి వచ్చిందని వాపోయింది. ఇకపై జరిగే అన్ని టోర్నీల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తానని వివరించింది. ఇక, చాలా కాలంగా ఆటకు దూరంగా ఉండడంతో పూర్వ వైభవం సాధించడం అనుకున్నంత తేలికకాదని అభిప్రాయపడింది.

అయితే తాను మాత్రం కఠోర సాధనతో మళ్లీ గాడిలో పడేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపింది. స్వదేశంలో జరిగే యూఎస్ ఓపెన్ తనకు చాలా కీలకంగా మారిందన్నాడు. ఈ సారి టైటిల్ గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నట్టు పేర్కొంది. అభిమానులు లేకుండా ఓ మెగా టోర్నీలో ఆడడం ఇదే తొలిసారని సెరెనా వివరించింది. అయితే కరోనా నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని వ్యాఖ్యానించింది.

Serena Williams Insane reparation for us open 2020

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post టైటిల్ సాధించడమే లక్ష్యం : సెరెనా విలియమ్స్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: