ఒక్కరోజే దాదాపు పాతికవేల కేసులు

  కరోనాతో దేశంలో విషాదదశ మహారాష్ట్రలో ఆగని విలయం తమిళనాడులో 4280 రికవరీలతో సంక్రమణల పోటీ ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానం న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే 24,850 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా కరోనాతో మొత్తం 613 మంది మృతి చెందారు. ఇంతకు ముందెప్పుడూ లేని రీతిలో ఒక్కరోజే దాదాపు పాతిక వేల మందికి కరోనా సంక్రమించిన తరువాత దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు […] The post ఒక్కరోజే దాదాపు పాతికవేల కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనాతో దేశంలో విషాదదశ
మహారాష్ట్రలో ఆగని విలయం
తమిళనాడులో 4280
రికవరీలతో సంక్రమణల పోటీ
ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే 24,850 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఒక్కరోజే దేశవ్యాప్తంగా కరోనాతో మొత్తం 613 మంది మృతి చెందారు. ఇంతకు ముందెప్పుడూ లేని రీతిలో ఒక్కరోజే దాదాపు పాతిక వేల మందికి కరోనా సంక్రమించిన తరువాత దేశంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 6,73,165కు చేరుకుంది. కోవిడ్ 19 కేసుల వివరాలను ఆదివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తమ బులెటిన్‌లో తెలియచేసింది. పలు ప్రాంతాలలో వైరస్ వ్యాప్తిని తెలియచేస్తూ వరుసగా మూడురోజులుగా రోజుకు 20వేలకు పైగా మందికి వైరస్ సంక్రమిస్తున్నట్లు గణాంకాలతో వెల్లడైంది. మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు రెండు లక్షలు దాటింది.

ఒక్కరోజే అత్యధికంగా 7,074 మందికి వైరస్ సోకిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలతో స్పష్టం అయింది. తరువాతి స్థానంలో తమిళనాడులో ఒక్కరోజే 4,280 మందికి కరోనా వచ్చింది. ఢిల్లీ, తెలంగాణ, కర్నాటక, అసోం, బీహార్‌లలో కేసులను కలిపి చూస్తే ఒక్కరోజే 7,935 మందికి వైరస్ సోకిందని వెల్లడైంది. ఈ ఏడు రాష్ట్రాలలోనే కరోనా కేసులు రోజురోజుకీ ఎక్కువవుతూ కొత్త కేసుల సంఖ్యలో దాదాపు 78 శాతం వరకూ ఈ రాష్ట్రాలలోనే నమోదు అవుతున్నట్లు తేలింది. మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకూ రికవరీఅయిన వారి సంఖ్య 4,09,082గా నిలిచింది. అయితే వైరస్ సోకుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ ఉండటంతో వైరస్ కట్టడి కొలిక్కి రావడం లేదని అధికారులు విశ్లేషిస్తున్నారు.

దేశంలో 2,44,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే ఆదివారం నాటికి మొత్తం 60.77 శాతం మంది రికవరీ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన వారి సంఖ్యను విదేశీయులతో కలిపి చూపినట్లు వివరించారు. శనివారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ నిర్థారణకు సంబంధించి 97,89,066 శాంపుల్స్‌ను పరీక్షించారు. వీరిలో శనివారం ఒక్కరోజే 2,44,934 మందిని పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 295 మంది, ఢిల్లీలో 81 మంది, తమిళనాడులో 65 మంది, కర్నాటక నుంచి 42 మంది, ఉత్తరప్రదేశ్‌లో 24 మంది కరోనాతో మృతి చెందినట్లు గణాంకాలతో వెల్లడైంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం 19,268 కరోనా మృతుల సంఖ్యలో మహారాష్ట్రలోనే ఎక్కువ విలయం కన్పించింది. అక్కడ 8671 మంది చనిపోగా తరువాతి స్థానంలో ఢిల్లీలో 3004 మంది, గుజరాత్‌లో 1925, తమిళనాడులో 1450, ఉత్తరప్రదేశ్‌లో 773 మంది, పశ్చిమ బెంగాల్‌లో 736, మధ్యప్రదేశ్‌లో 598, రాజస్థాన్‌లో 447, కర్నాటకలో 335 మంది మృతి చెందినట్లు నిర్థారణ అయింది.

రష్యాతో పోటీపడుతున్న భారత్
కరోనా కేసుల విషయంలో భారత్ ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా చూస్తే నాలుగో స్థానంలో ఉంది. మూడు స్థానంలో ఉన్న రష్యాలో ఇప్పుడు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,74,515. భారత్‌లో మొత్తం కేసుల సంఖ్య 6,73,165గా నిలిచింది. అమెరికాలోని జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కరోనా వైరస్ పరిస్థితిని సమీక్షిస్తూ గణాంకాలను వెల్లడిస్తోంది. ఈ విద్యాలయ గణాంకాల మేరకు అమెరికా, బ్రెజిల్, రష్యా తరువాత నాలుగో స్థానంలో ఇండియా ఉంది. అయితే కరోనా మృతుల సంఖ్య విషయంలో ఎనిమిదో స్థానంలో ఉంది.

కరోనాను గెలిచిన 106 ఏండ్ల వృద్ధుడు
ఢిల్లీలో విలయం సృష్టిస్తోన్న కరోనాతో జరిపిన పోరులో 106 ఏళ్ల వృద్ధుడు విజయం సాధించారు. ఢిల్లీవాసి అయిన ఈ వ్యక్తి ఇప్పుడు కోలుకుంటున్నట్లు స్థానిక ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ వ్యక్తి భార్య , కొడుకు కూడా కరోనాకు గురయ్యారు. అయితే ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి ముసలి వ్యక్తి క్రమేపీ కోలుకున్నట్లు ఈ వ్యక్తి నాలుగేళ్ల చిన్నతనంలో ఉన్నప్పుడు 1918లో స్పానిష్ ఫ్లూ వచ్చింది. అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైందని తమ పెద్దలు చెపుతూ ఉండేవారని ఈ పెద్దాయన తెలిపారు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జి అయ్యారు. ఆయన ఇంటికి క్షేమంగా చేరుకోవడంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే భార్య కొడుకు పరిస్థితిపై తాను ఆందోళన చెందుతున్నట్లు ఈ వృద్ధుడు తెలిపారు.

India reports 24,850 cases, 613 deaths on sunday

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఒక్కరోజే దాదాపు పాతికవేల కేసులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: