బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు : 8మంది మృతి

ల‌క్నో : ఉత్తర ప్రదేశ్ లో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి ఎనిమిది మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయడ్డారు. ఈ ఘటన ఘజియాబాద్ మోదీనగర్ లో ఆదివారం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు  పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో కర్మాగారంలో 30 […] The post బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు : 8మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ల‌క్నో : ఉత్తర ప్రదేశ్ లో ఘోర ఘటన చోటు చేసుకుంది. ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించి ఎనిమిది మంది చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయడ్డారు. ఈ ఘటన ఘజియాబాద్ మోదీనగర్ లో ఆదివారం జరిగింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు  పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన సమయంలో కర్మాగారంలో 30 మంది కార్మికులు ఉన్నారు. పేలుళ్ల ధాటికి బయటకి పారిపోయేందుకు కార్మికులు ప్రయత్నించినప్పటికీ వీలు కాలేదు. దీంతో 8 మంది సజీవ దహనమయ్యారు. ఈ బాణాసంచా కర్మాగారాన్ని గత ఐదు సంవత్సరాలుగా అక్రమంగా నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ కర్మాగారంపై అనేకమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఘటన అనంతరం అధికారులు, పోలీసులు కర్మాగారాన్ని పరిశీలించారు. కర్మాగారం యజమానిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు వారు వెల్లడించారు.

 

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు : 8మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: