ఎపిపై కరోనా పంజా : 998 కొత్త కేసులు…14 మరణాలు

అమరావతి: ఎపిలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతుండడంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 998 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఎపికి చెందిన 961 మంది, వేరే రాష్ట్రాల నుంచి 36 మంది, విదేశాల నుంచి వచ్చిన ఒకరు ఉన్నారు. ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,697కు […] The post ఎపిపై కరోనా పంజా : 998 కొత్త కేసులు…14 మరణాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి: ఎపిలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతుండడంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 998 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. 14 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కొత్తగా కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఎపికి చెందిన 961 మంది, వేరే రాష్ట్రాల నుంచి 36 మంది, విదేశాల నుంచి వచ్చిన ఒకరు ఉన్నారు. ఎపిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,697కు చేరింది. 8,422 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రజలు సహకరించినప్పుడే కరోనా కట్టడి సాధ్యమని ఎపి వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రోడ్లపైకి వచ్చినప్పడు సామాజిక దూరం పాటించాలని, విధిగా మాస్క్ లు ధరించాలని వారు ప్రజలకు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు చెబుతున్నారు.

The post ఎపిపై కరోనా పంజా : 998 కొత్త కేసులు…14 మరణాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: