బాలయ్యకు జోడీగా అమలాపాల్

హైదరాబాద్ : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాకు ’మోనార్క్‘ అనే టైటిల్ ను నిర్ణయించినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటించనున్నారన్న అంశంపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఇది బాలయ్యకు 106వ సినిమా. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఓ కొత్త హీరోయిన్ కు అవకాశం ఉండగా, మరో హీరోయిన్ ఎవరన్న […] The post బాలయ్యకు జోడీగా అమలాపాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా వస్తోంది. ఈ సినిమాకు ’మోనార్క్‘ అనే టైటిల్ ను నిర్ణయించినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలయ్య సరసన ఎవరు నటించనున్నారన్న అంశంపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఇది బాలయ్యకు 106వ సినిమా. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో ఓ కొత్త హీరోయిన్ కు అవకాశం ఉండగా, మరో హీరోయిన్ ఎవరన్న దానిపై టాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రముఖ హీరోయిన్ అంజలితో పాటు పలువురి పేర్లను బోయపాటి శ్రీను పరిశీలించారని సమాచారం. అయితే ప్రముఖ నటి అమలాపాల్ ఈ సినిమాలో బాలయ్య సరసన నటించనుందని తాజా వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ’నాయక్‘, అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ’ఇద్దరమ్మాయిలతో…‘తో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post బాలయ్యకు జోడీగా అమలాపాల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: