ఇ-కామర్స్ జోరు

  కరోనా వేళలో పెరిగిన డిమాండ్ 50 వేల మంది పైగా ఉద్యోగుల అవసరం అమెజాన్, గ్రోఫర్స్, పేటీఎం మాల్‌లలో భారీ నియామకాలు న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, పలు కంపెనీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. పలు కంపెనీలు వ్యాపారం మూసివేయడం, ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. అయితే లాక్‌డౌన్ సమయంలోనూ ఆన్‌లైన్ అమ్మకాలు సాధారణంగా కొనసాగడంతో ఇకామర్స్ సంస్థలకు డిమాండ్ పెరిగింది. ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, గ్రోఫర్స్, పేటీఎం మాల్ వంటి […] The post ఇ-కామర్స్ జోరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా వేళలో పెరిగిన డిమాండ్
50 వేల మంది పైగా ఉద్యోగుల అవసరం
అమెజాన్, గ్రోఫర్స్, పేటీఎం మాల్‌లలో భారీ నియామకాలు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, పలు కంపెనీలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. పలు కంపెనీలు వ్యాపారం మూసివేయడం, ఉద్యోగులను తొలగించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. అయితే లాక్‌డౌన్ సమయంలోనూ ఆన్‌లైన్ అమ్మకాలు సాధారణంగా కొనసాగడంతో ఇకామర్స్ సంస్థలకు డిమాండ్ పెరిగింది. ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, గ్రోఫర్స్, పేటీఎం మాల్ వంటి సంస్థలు నిరుద్యోగ కాలంలో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ కంపెనీలు వినియోగదారుల అవసరాల దృష్టా డెలివరీ సేవలను మెరుగుపరచడానికి భారీగా నియామకాలు చేపడుతున్నాయి. అమెజాన్ ఇండియా 20 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించబోతోంది.

ఈ నగరాల్లో నియామకం..
వచ్చే ఆరు నెలల్లో వినియోగదారుల సంఖ్య పెరుగుతుందని ఊహించి ఈ తాత్కాలిక ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. ఈ తాత్కాలిక ఉద్యోగ నియామకాలు నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగఢ్, ఇండోర్, భోపాల్, లక్నో, హైదరాబాద్, పూణే, కోయంబత్తూర్, మంగళూరులలో ఉంటాయి. అమెజాన్ నియామకాలు వర్చువల్ కస్టమర్ కేర్ ప్రోగ్రామ్ కోసం ఉంటాయి. ఇది ఇంటి నుండి పని చేసే సౌకర్యాన్ని అందిస్తుంది. నియమించిన ఉద్యోగులు ఇమెయిల్, చాట్, సోషల్ మీడియా, ఫోన్ ద్వారా వినియోగదారులకు సహాయం చేస్తారు.

ఈ పోస్టులకు కనీస అర్హత 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు లేదా కన్నడ భాషపై మంచి పట్టు ఉండాలి. దేశంలో కరోనా వైరస్ కారణంగా మార్చి 2 నుండి లాక్‌డౌన్ కారణంగా బిగ్ బాస్కెట్ వ్యాపారం పెరిగింది. బిగ్ బాస్కెట్ పదివేల మంది నియామకాలు ఇప్పటికే చేపట్టింది. తద్వారా మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి తగిన శ్రామిక శక్తిని ఏర్పాటు చేసుకుంది. ఇవే కాకుండా 300 ఉద్యోగాలు కల్పిస్తామని పేటీఎం మాల్ ప్రకటించింది.

ఈకామ్ ఎక్స్‌ప్రెస్‌లో 7వేల నియామకాలు..
థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సంస్థ ఈకామ్ ఎక్స్‌ప్రెస్ కూడా రాబోయే రెండు నెలల్లో 7 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు తెలిపింది. న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, సూరత్, చండీగఢ్, ఇండోర్, పాట్నా, లక్నో, కాన్పూర్, భోపాల్, జైపూర్‌లలో ఈ నియామకాలు జరుగుతాయి. ఈకామ్ సంస్థ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, పేటీఎం వంటి సంస్థల కోసం పనిచేస్తుంది. పండుగ సీజన్లో, ఆన్‌లైన్ షాపింగ్‌లో పెరుగుదల ఉంటుంది. ఈ ఏడాది పండుగ ప్రారంభం నాటికి 35 వేల మంది ఉద్యోగులను నియమించే ప్రణాళికను ఈ-కామ్ ఎక్స్‌ప్రెస్ సిద్ధం చేసింది. అలాగే మింత్రా 5,000 మంది ఉద్యోగులను తీసుకోనుంది.

Amazon India to hire 20,000 temporary workers

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post ఇ-కామర్స్ జోరు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: