పన్ను చెల్లింపుదారులకు ఊరట

  ఐటిఆర్ గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు న్యూఢిల్లీ : ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. గత ఆర్థిక సంవత్సరం (201920) ఆదాయం పన్ను రిటర్న్‌ల (ఐటిఆర్) దాఖలుకు ఆఖరు తేదీని 2020 నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈమేరకు శనివారం ఆదాయం పన్ను (ఐటి) శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకుంది. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్టా ఈ నిర్ణ […] The post పన్ను చెల్లింపుదారులకు ఊరట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఐటిఆర్ గడువు నవంబర్ 30 వరకు పొడిగింపు

న్యూఢిల్లీ : ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. గత ఆర్థిక సంవత్సరం (201920) ఆదాయం పన్ను రిటర్న్‌ల (ఐటిఆర్) దాఖలుకు ఆఖరు తేదీని 2020 నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈమేరకు శనివారం ఆదాయం పన్ను (ఐటి) శాఖ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణ యం తీసుకుంది. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్టా ఈ నిర్ణ యం తీసుకున్నాం. ఐటిఆర్ దాఖలుకు గడువును నవంబర్ 30 వరకు పొడిగించాం’ అని ట్విట్టర్‌లో ఐటి శాఖ తెలిపింది.

అసెస్‌మెంట్ ఇయర్ 2020-21కి గాను ఐటిఆర్‌లు దాఖలు చేయడానికి ప్రభుత్వం ఈ సమయం ఇచ్చింది. గత వారం సిబిడిటి (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) నోటిఫికేషన్‌లో 201819 సంవత్సరానికి గాను ఐటిఆర్ దాఖలు గడువును 2020 జులై 31 వరకు పొడిగించింది. దీంతోపాటు కేంద్ర పాన్‌తో ఆధార్ సంఖ్య అనుసంధానానికి గడువు తేదీని 2021 మార్చి వరకు పొడిగించింది. అలాగే 201920 నుంచి 2020 జులై 31 వరకు టిడిఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్), టిసిఎస్ (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) దాఖలు చేసేందుకు గడువును కూడా ఐటి శాఖ పెంచింది. అదే సమయంలో 201920 సంవత్సరానికి గాను టిడిఎస్/ టిసిఎస్ సర్టిఫికేట్‌ల జారీ గడువును కూడా ఆగస్టు 15 వరకు కేంద్రం పొడిగించింది.

యజమానులకు ఉద్యోగులకు ఫారం 16 జారీ చేయడానికి ప్రభుత్వం చివరి తేదీని పొడిగించింది. అసెస్‌మెంట్ ఇయర్ 2020-21కి సిబిడిటి ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాలను 1 నుండి 7 వరకు తెలియజేసింది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సౌకర్యం ప్రస్తుతం 2020-21 అంచనా సంవత్సరానికి ఐటిఆర్ 1, ఐటిఆర్ 2, ఐటిఆర్ 4 ని దాఖలు చేయాలనుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉంది. 2020-21 సంవత్సరానికి ఐటిఆర్1, ఐటిఆర్2, ఐటిఆర్4 ఇ-ఫైలింగ్‌కు అందుబాటులో ఉన్నాయని ఐటి శాఖ పేర్కొంది.

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post పన్ను చెల్లింపుదారులకు ఊరట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: